చెరువులను తలపిస్తున్న డబుల్ ఇండ్లు

చెరువులను తలపిస్తున్న డబుల్ ఇండ్లు
  • మేడ్చల్ జిల్లా కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి  హరివర్ధన్ రెడ్డి

శామీర్ పేట, వెలుగు :  డబుల్ బెడ్రూమ్ ఇండ్లు చెరువులను తలపిస్తున్నాయని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నారు.  లోతట్టు ప్రాంతాల్లో నివసించే పేదల పరిస్థితి ఎలా ఉందో ప్రజలు గమనించాలని పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం తూంకుంట మున్సిపాలిటీలోని డబుల్ బెడ్రూమ్ లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..డబులు బెడ్రూమ్ ఇండ్లను  కట్టించి ఏండ్లుగా లబ్ధిదారులకు ఇవ్వడంలేదని.. ఇలా చెరువులుగా మారితే, ఇచ్చిన తర్వాత ప్రజల పరిస్థితి ఏంటని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

దళితులకు కేటాయించిన భూమిని బలవంతంగా లాక్కొని, కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వకుండా అందులో నాణ్యతలేని ఇండ్లను నిర్మించిందని మండిపడ్డారు. డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగ్గా ఏర్పాటు చేయలేదని.. మంత్రి మల్లారెడ్డి, అధికారులు ఎక్కడ నిద్రపోతున్నారని మండిపడ్డారు. తూంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు భీమిడి జైపాల్ రెడ్డి, మొగుళ్ల శ్రీనివాస్ రెడ్డి, తూంకుంట మునిసిపల్ కౌన్సిలర్ మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు కొండల్ రెడ్డి, జగన్, రాంచందర్ యాదవ్, మోహనరెడ్డి, దర్శన్ గౌడ్, మురళీ గౌడ్ 
తదితరులు  ఉన్నారు.