పట్టించుకోని తండ్రి పేరు పాస్‌పోర్టులో మాత్రం ఎందుకు... సమర్థించిన హైకోర్టు

పట్టించుకోని తండ్రి పేరు పాస్‌పోర్టులో మాత్రం ఎందుకు... సమర్థించిన హైకోర్టు

కొడుకు పాస్ట్ పార్టులో తండ్రి పేరు తొలగించాలని చేస్తోన్న ఓ తల్లి పోరాటం ఫలించింది. తనను, కొడుకు బాధ్యతలు పట్టించుకోని వ్యక్తి పేరు పాస్ పోర్టులో ఎందుకుండాలన్న ఆ తల్లి ప్రశ్నకు ఢిల్లీ హైకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. తండ్రి పేరును తన కొడుకు పాస్‌పోర్ట్ నుంచి తొలగించాలని, బిడ్డ పుట్టకముందే ఆ వ్యక్తి తమను విడిచిపెట్టాడని ఆ తల్లి పిటిషన్ లో పేర్కొంటూ హైకోర్టును ఆశ్రయించింది.
ఈ కేసుపై వాదనలు విన్న కోర్టు.. వాస్తవానికి, ఇది తండ్రి బిడ్డను పూర్తిగా విడిచిపెట్టిన కేసు అవుతుందని అభిప్రాయపడింది.

ఈ కేసు  ప్రత్యేకమైన, విచిత్రమైన పరిస్థితులలో, తదనుగుణంగా పాస్‌పోర్ట్ నుంచి పిల్లల తండ్రి పేరును తొలగించి, తండ్రి పేరు లేకుండా మైనర్ బిడ్డకు అనుకూలంగా పాస్‌పోర్ట్ మళ్లీ జారీ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొన్ని పరిస్థితుల్లో  తండ్రి పేరును తొలగించవచ్చని, ఇంటిపేరును కూడా మార్చుకోవచ్చని హైకోర్టు పేర్కొంది.