సింగిల్ రాజు మూవీ టైటిల్ గ్లిమ్ప్స్ రిలీజ్...

సింగిల్ రాజు మూవీ టైటిల్ గ్లిమ్ప్స్ రిలీజ్...

విశ్వాస్, మౌనిక, దివ్య లీడ్ రోల్స్‌‌లో ఎస్.ఎస్.వర్మ తెర‌‌కెక్కిస్తున్న యూత్‌‌ఫుల్ లవ్ ఎంటర్‌‌టైనర్‌‌ ‘సింగిల్ రాజు’. సోమవారం ప్రసాద్ ల్యాబ్స్‌‌లో ఈ మూవీ ప్రెస్‌‌మీట్ జరిగింది.  ముఖ్య అతిథిగా హాజరైన  దర్శకుడు వేణు ఊడుగుల టైటిల్ పోస్టర్‌‌తో పాటు గ్లింప్స్‌‌ను రిలీజ్ చేశారు.  

ఈ చిత్రం కథ వినగానే ఎంతో ఆసక్తిగా అనిపించిందని,  టీమ్ అందరూ పెద్ద విజయాన్ని అందుకోవాలంటూ బెస్ట్ విషెస్ చెప్పారు. విలేజ్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో వస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు ఎంతో ప్యాషన్‌‌తో తీశారని, ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంటుందని హీరోహీరోయిన్స్‌‌ తెలియజేశారు. 

వేణు ఊడుగుల అన్న సపోర్ట్‌‌తోనే ఈ చిత్రం సాధ్యమైందని, ప్రేక్షకులను తప్పకుండా అలరించే మంచి ఎంటర్‌‌టైనర్‌‌గా నిలుస్తుందనే నమ్మకముందని దర్శకుడు ఎస్.ఎస్. వర్మ చెప్పాడు.