అక్కడ ఒంటి గంట వరకు ఒక్క ఓటు కూడా పడలేదు

అక్కడ ఒంటి గంట వరకు ఒక్క ఓటు కూడా పడలేదు

సిద్దిపేట : రాష్ట్రమంతటా పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ జరుగుతోంది. పలుచోట్ల ఓటరు చైతన్యం కనిపించింది. మరికొన్ని చోట్ల తక్కువ మంది కనిపించారు. ఐతే… ఓ గ్రామంలో మాత్రం మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఒక్క ఓట్ కూడా పోల్ కాలేదు.

మిరుదొడ్డి మండలం ఆరెపల్లె గ్రామంలో మధ్యాహ్నం 1:00 (ఒంటి గంట) దాటినా కూడా ఒక్క ఓటు కూడా వేయలేదు గ్రామస్తులు. పోలింగ్ కేంద్రాన్ని తమ గ్రామంలో ఏర్పాటు చేసేదాకా ఓటు వేసేది లేదని తేల్చారు గ్రామస్తులు.

ఆరెపల్లి ఓ చిన్న గ్రామం. ధర్మారం MPTC పరిధిలోకి ఈ గ్రామం వస్తుంది. ఇక్కడు దగ్గర్లో(దాదాపు 3 కి.మీ. దూరం) ఉన్న లక్ష్మీనగర్ అనే గ్రామంలో ఆరెపల్లి ఓటర్లకు పోలింగ్ కేంద్రం ఏర్పాటుచేశారు. ఐతే… తమ ఊరిలోనే పోలింగ్ కేంద్రం పెట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. లేకపోతే ఓటు వేసేది లేదని ముందే తేల్చిచెప్పారు.
జిల్లా అధికారులు ఆరెపల్లి గ్రామానికి వచ్చి నచ్చచెప్పినా గ్రామస్తులు వినలేదు. జనం తమ మాట వినకపోవడంతో డీపీఓ సురేష్ బాబు, ఎంపీడీఓ మల్లికార్జున్ వెనుదిగిరి వెళ్లిపోయారు.