రోమ్: సిన్నర్ఆట స్థిరంగా ఉంటుందని, ఎక్కడా తడబాటు కనిపించదని మాడ్రిడ్ ఓపెన్ ఫైనల్‌లో ఓడిపోయిన అలెగ్జాండర్ జ్వెరెవ్ పేర్కొన్నారు. ఇటలీ ఆటగాడు సిన్నర్ చేతిలో జ్వెరెవ్‌కు ఇది వరుసగా తొమ్మిదో ఓటమి. స్పానిష్ రాజధానిలో టైటిల్ గెలవడం ద్వారా వరుసగా ఐదు మాస్టర్స్ 1000 టోర్నీలు నెగ్గిన తొలి ఆటగాడిగా సిన్నర్ రికార్డు సృష్టించాడు.
ప్రస్తుతం వరుసగా 23 మ్యాచ్‌ల విజయపరంపరతో దూసుకుపోతున్నాడు. 24 ఏళ్ల వయసులోనే సిన్నర్ తన ఆటను ఇంకా మెరుగుపరుచుకుంటూనే ఉన్నాడని అన్నాడు. " అతడు ఇంకా తన పూర్తి సామర్థ్యాన్ని చేరుకోలేదు. శిక్షణపై ఆసక్తి తగ్గకుండా ఉండడానికి ఇదే ప్రధాన కారణం" అని సిన్నర్ కోచ్ సిమోన్ వాగ్నోజీ తెలిపారు.
సిన్నర్ ఈ వారం తన సొంత దేశంలో జరిగే ఇటాలియన్ ఓపెన్‌లో బరిలోకి దిగనున్నాడు. సిన్నర్ఇప్పటివరకు గెలవని ఏకైక మాస్టర్స్ సిరీస్ ఇదే కావడం విశేషం. మే 24 నుంచి ప్రారంభమయ్యే ఫ్రెంచ్ ఓపెన్ కోసం సిన్నర్ విశ్రాంతి తీసుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ జ్వెరెవ్‌పై విజయం తర్వాత ఆ వార్తలను కొట్టిపారేశాడు.
