యూఎస్ ఓపెన్ లో ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో సినర్‌‌‌‌‌‌‌‌

యూఎస్ ఓపెన్ లో ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో సినర్‌‌‌‌‌‌‌‌

న్యూయార్క్‌‌‌‌‌‌‌‌: యూఎస్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌ సీడ్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. ఇటలీ స్టార్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌, టాప్‌‌‌‌‌‌‌‌సీడ్‌‌‌‌‌‌‌‌ యానిక్‌‌‌‌‌‌‌‌ సినర్‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లోకి చేరుకోగా, మూడోసీడ్‌‌‌‌‌‌‌‌ అలెగ్జాండర్‌‌‌‌‌‌‌‌ జ్వెరెవ్‌‌‌‌‌‌‌‌ (జర్మనీ) మూడో రౌండ్‌‌‌‌‌‌‌‌లోనే ఇంటిముఖం పట్టాడు. శనివారం అర్ధరాత్రి జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ థర్డ్‌‌‌‌‌‌‌‌ రౌండ్‌‌‌‌‌‌‌‌లో సినర్‌‌‌‌‌‌‌‌ 5–7, 6–4, 6–3, 6–3తో డెనిస్‌‌‌‌‌‌‌‌ షపవలోవ్‌‌‌‌‌‌‌‌ (కెనడా)పై గెలిచాడు. కానీ ఇదే రౌండ్‌‌‌‌‌‌‌‌లో జ్వెరెవ్‌‌‌‌‌‌‌‌ 6–4, 6–7 (7/9), 4–6, 4–6తో ఫెలిక్స్‌‌‌‌‌‌‌‌ అగుర్‌‌‌‌‌‌‌‌ (కెనడా) చేతిలో కంగుతిన్నాడు. షపవలోవ్‌‌‌‌‌‌‌‌తో 3 గంటలా 12 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో సినర్‌‌‌‌‌‌‌‌ తొలి సెట్‌‌‌‌‌‌‌‌ కోల్పోయాడు. ఫలితంగా ఒక్క సెట్‌‌‌‌‌‌‌‌ కూడా కోల్పోకుండా వరుసగా 14 మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల రికార్డుకు బ్రేక్‌‌‌‌‌‌‌‌ పడింది. అయితే మేజర్స్‌‌‌‌‌‌‌‌లో హార్డ్‌‌‌‌‌‌‌‌ కోర్టు విజయాల రికార్డును మాత్రం 24కు పెంచుకున్నాడు. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో తన సర్వీస్‌‌‌‌‌‌‌‌ బాగాలేదని ఒప్పుకున్న సినర్‌‌‌‌‌‌‌‌ మూడో సెట్‌‌‌‌‌‌‌‌లోనూ చాలా వెనకబడ్డాడు. మ్యాచ్‌‌‌‌‌‌‌‌ మొత్తంలో సినర్‌‌‌‌‌‌‌‌ 2 ఏస్‌‌‌‌‌‌‌‌లు, 5 డబుల్‌‌‌‌‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌‌‌‌‌ చేస్తే, షపవలోవ్‌‌‌‌‌‌‌‌ 9 డబుల్‌‌‌‌‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌‌‌‌‌ చేసి 15 ఏస్‌‌‌‌‌‌‌‌లు సంధించాడు. 13 బ్రేక్‌‌‌‌‌‌‌‌ పాయింట్లలో సినర్‌‌‌‌‌‌‌‌ ఆరింటిని కాచుకుంటే, షపవలోవ్‌‌‌‌‌‌‌‌ ఆరింటిలో మూడింటినే సద్వినియోగం చేసుకున్నాడు. 

36 అన్‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌‌‌‌‌, 31 విన్నర్లతో సినర్‌‌‌‌‌‌‌‌ ఆధిక్యంలో నిలిస్తే, షపవలోవ్‌‌‌‌‌‌‌‌ 47 అన్‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌‌‌‌‌, 30 విన్నర్స్‌‌‌‌‌‌‌‌ మాత్రమే కొట్టాడు. ఫెలిక్స్‌‌‌‌‌‌‌‌తో జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో జ్వెరెవ్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌ల్లో తేలిపోయాడు. ఫలితంగా బ్రేక్‌‌‌‌‌‌‌‌ పాయింట్లను కాపాడుకోవడంలో ఫెయిలయ్యాడు. ఇతర మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ముసెటీ (ఇటలీ) 6–3, 6–2, 6–0తో కొబలీ (ఇటలీ)పై, అలెగ్జాండర్‌‌‌‌‌‌‌‌ బుబ్లిక్‌‌‌‌‌‌‌‌ (కజకిస్తాన్‌‌‌‌‌‌‌‌) 7–6 (7/5), 6–7 (4/7), 6–3, 6–7 (5/7), 6–1తో టొమ్మి పాల్‌‌‌‌‌‌‌‌ (అమెరికా)పై, రబ్లెవ్‌‌‌‌‌‌‌‌ (రష్యా) 2–6, 6–4, 6–3, 4–6, 6–3తో వాంగ్‌‌‌‌‌‌‌‌ (చైనా)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లోకి అడుగుపెట్టాడు. విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్​లో పెగులా (అమెరికా) 6–1, 6–2తో అన్​ లీ (అమెరికా)పై గెలిచి క్వార్టర్స్​లోకి ప్రవేశించగా,  మూడో రౌండ్‌‌‌‌‌‌‌‌లో స్వైటెక్‌‌‌‌‌‌‌‌ (పోలెండ్‌‌‌‌‌‌‌‌) 7–6 (7/2), 6–4తో కలిన్‌‌‌‌‌‌‌‌స్కయా (రష్యా)పై, ఒసాక (జపాన్‌‌‌‌‌‌‌‌) 6–0, 4–6, 6–3తో కసాట్కినా (ఆస్ట్రేలియా)పై, ముచోవా (చెక్‌‌‌‌‌‌‌‌) 6–7 (5/7), 6–4, 6–2తో నోస్కోవా (చెక్‌‌‌‌‌‌‌‌)పై, అనిసిమోవా (అమెరికా) 6–4, 4–6, 6–2తో క్రిస్టియాన్‌‌‌‌‌‌‌‌ (జర్మనీ)పై నెగ్గి ముందంజ వేశారు. 

రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌లో యూకీ జోడీ

మెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో యూకీ బాంభ్రీ–మైకేల్‌‌‌‌‌‌‌‌ వీనస్‌‌‌‌‌‌‌‌ (న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌) 6–0, 6–3తో అమెరికా జంట మార్కోస్‌‌‌‌‌‌‌‌ గిరోన్‌‌‌‌‌‌‌‌–లెర్నర్‌‌‌‌‌‌‌‌ టియెన్‌‌‌‌‌‌‌‌పై గెలిచారు. మరో మ్యాచ్​లో అర్జున్‌‌‌‌‌‌‌‌ ఖడే–డియాగో హిడాల్గో (ఈక్వెడార్‌‌‌‌‌‌‌‌) 7–5, 6–7 (4/7), 4–6తో మ్యాట్‌‌‌‌‌‌‌‌ పావిచ్‌‌‌‌‌‌‌‌ (క్రొయేషియా)–మార్సెలో అరెవాలో (ఎల్‌‌‌‌‌‌‌‌ సాల్వెడార్‌‌‌‌‌‌‌‌)చేతిలో ఓడారు.