వచ్చే వారం నుంచి 15 రాష్ట్రాల్లో 'సర్' ప్రాసెస్ షురూ!

వచ్చే వారం నుంచి 15 రాష్ట్రాల్లో 'సర్' ప్రాసెస్ షురూ!

న్యూఢిల్లీ: వచ్చే వారం నుంచి కేంద్ర ఎన్నికల సంఘం 10 నుంచి 15 రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, బెంగాల్​లో తొలుత సర్  ప్రక్రియ ప్రారంభం కానుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. 

ఎన్నికల కమిషన్ ఇప్పటికే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులతో (సీఈవోలు) రెండు సమావేశాలు నిర్వహించిందన్నారు. సీఈవోలు కూడా తమ రాష్ట్రాలకు చెందిన చివరి సర్ తర్వాత ప్రచురించిన ఓటరు జాబితాలను వెబ్‌‌‌‌‌‌‌‌సైట్లలో ఉంచారు. ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌లో చివరి సర్ ప్రక్రియ 2006లో జరిగింది. 

చాలా రాష్ట్రాలు 2002, 2004 మధ్య ఓటరు జాబితాలో చివరి సర్ ప్రాసెస్ నిర్వహించినట్లు తెలుస్తున్నది. తమిళనాడులో వచ్చే వారం నుంచి సర్‌‌‌‌‌‌‌‌ ప్రాసెస్ ప్రారంభమవుతుందని మద్రాస్‌‌‌‌‌‌‌‌ హైకోర్ట్‌‌‌‌‌‌‌‌కు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.