ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి 

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి 

రాజన్నసిరిసిల్ల, వెలుగు: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని రాజన్నసిరిసిల్ల జిల్లా అడిషనల్​కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్  అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణికి మొత్తం 53 ఫిర్యాదులు వచ్చినట్లు అడిషనల్​కలెక్టర్​తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో శ్రీనివాస్ రావు , ఆర్డీవో పవన్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

కరీంనగర్‌‌లో 175 ఫిర్యాదులు 

కరీంనగర్ టౌన్, వెలుగు:  కరీంనగర్​కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 175 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ పంచాయతీ పరిధిలోని  సర్వే నంబర్​ 728లోని  4.02ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామానికి చెందిన డి.బాబు కొంతమందితో కలిసి  గ్రీవెన్ సెల్ లో ఫిర్యాదు చేశారు.  కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

నా బిడ్డకు పింఛన్​ ఇప్పించుండ్రి

పెద్దపల్లి, వెలుగు: ఏడేండ్లుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నామని,  దివ్యంగురాలైనా తన బిడ్డ శైలజకు  ఇప్పటికైనా పింఛన్ ​ఇప్పించండని పెద్దపల్లి మండలం తురకల మద్దికుంటకు చెందిన విలాసాగరపు మల్లయ్య అధికారులను వేడుకున్నారు.  పెద్దపల్లి  కలెక్టరేట్‌లో  సోమవారం గ్రీవెన్స్ సందర్భంగా దివ్యాంగురాలు శైలజ తండ్రి మల్లయ్యతో కలిసి అధికారులకు వినతిపత్రం​ఇచ్చారు. 2016లోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 100 శాతం దివ్యాంగురాలిగా  సర్టిఫికెట్​ ఇచ్చారని, అయినా నేటికీ పింఛన్​రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.