సిర్పూర్(టి) ఎస్సీ రెసిడెన్షియల్ కు రెయిన్ హాలిడేస్

సిర్పూర్(టి) ఎస్సీ రెసిడెన్షియల్ కు రెయిన్ హాలిడేస్

 

  • శిథిలావస్థకు చేరిన స్కూల్ బిల్డింగ్ 
  • భారీ వర్షాలకు కురుస్తున్న  క్లాస్ రూమ్స్   
  • ఉన్నతాధికారుల ఆదేశాలతోనే సెలవులు ఇచ్చామన్న ప్రిన్సిపాల్   


కాగజ్ నగర్, వెలుగు: ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్(టి)లోని సోషల్ వెల్ఫేర్ బాయ్స్ స్కూల్ కి ఐదు రోజులు రెయిన్ హాలిడేస్ ఇచ్చారు. తల్లిదండ్రులను పిలిపించి విద్యార్థులను ఇండ్లకు పంపించి వేశారు.  స్కూల్ బిల్డింగ్, హాస్టల్, డార్మెటరీ భవనాలు శిథిలావస్థకు చేరాయి. పై కప్పు బాగోలేదు.  వర్షం వచ్చినప్పుడు తరగతి గదులు కురుస్తున్నాయి. దీంతో విద్యార్థులను మరో బిల్డింగ్ లోకి మార్చేందుకు ముందు జాగ్రత్తగా హాలీడేస్ ఇచ్చారు. 

స్కూల్లోని 489 మంది స్టూడెంట్స్ ను బుధవారం ఇండ్లకు పంపించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో సెలవులు ఇచ్చి విద్యార్థులను పంపామని ప్రిన్సిపల్ శ్రీనివాస్ రావు చెప్పారు. స్కూల్, హాస్టల్ బిల్డింగ్ నిర్మాణానికి రూ. 6 కోట్లు మంజూరైనట్టు, వాటి టెండర్లు కంప్లీట్ కావాల్సి ఉందని చెప్పారు. పిల్లల భవిష్యత్, సేఫ్టీ దృష్టా నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.