వైఎస్ వివేకా మృతిపై SIT ఏర్పాటు

వైఎస్ వివేకా మృతిపై SIT ఏర్పాటు

కడప : వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి మృతిపై  దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటైంది. కడప జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) బి.లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ‘సిట్’ ఏర్పాటు చేశారు ఉన్నతాధికారులు. వివేకా పీఏ కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో… సంఘటన స్థలానికి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో పాటు వెళ్లి పరిశీలించారు దర్యాప్తు బృందం అధికారులు.

అన్ని కోణాల్లో కేసును విచారిస్తున్నామని కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ చెప్పారు. ఫోరెన్సిక్ నిపుణులను ప్రత్యేకంగా రప్పిస్తున్నామని ఎస్పీ చెప్పారు. కేసును సీరియస్ గా తీసుకున్నామని, విచారణలో ఎవరి పాత్ర వున్నట్లు తేలినా వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు.

వైఎస్ వివేకా మృతదేహానికి పోస్టుమార్టమ్

అనుమానాస్పదం అంటూ కంప్లయింట్ రావడంతో… వివేకానంద రెడ్డి మృతదేహానికి ఈ ఉదయం శవ పరీక్షలు నిర్వహించారు పోలీసులు. అనంతపురం నుంచి వచ్చిన వైద్య నిపుణులు… పోస్ట్ మార్టమ్ నిర్వహించారు. ఈ నివేదిక ఆధారంగా సిట్ దర్యాప్తు కొనసాగనుంది.