ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: ప్రతాప్ గౌడ్ను 8 గంటలు విచారించిన సిట్

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: ప్రతాప్ గౌడ్ను 8 గంటలు విచారించిన సిట్

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న అడ్వకేట్ ప్రతాప్ గౌడ్, నందకుమార్ భార్య చిత్రలేఖను దాదాపు 8 గంటల పాటు  ప్రశ్నించిన సిట్ అధికారులు... ఇవాళ  ప్రతాప్ గౌడ్ ను 8 గంటల పాటు  విచారించారు. ప్రతాప్ గౌడ్ ఆర్థిక లావాదేవీల పై అధికారులు ఆరా తీశారు. రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ అకౌంట్స్ నుండి డబ్బుల బదిలీ పై  ప్రశ్నించారు.

ప్రతాప్ గౌడ్ స్టేట్ మెంట్ మొత్తాన్ని సిట్ అధికారులు రికార్డు చేశారు.  మళ్ళీ ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరు కావాలని ప్రతాప్ కు సిట్ అధికారులు ఆదేశించారు.  గతంలో నందకుమార్ అంబర్‌పేటలో హోటల్ నిర్వహించగా.. అదే ప్రాంతానికి చెందిన ప్రతాప్ అతనికి భారీగా డబ్బు ఇచ్చినట్లు సిట్ అధికారులు సమాచారం సేకరించారని తెలుస్తోంది. అటు నందకుమార్ భార్య చిత్రలేఖను సోమవారం మరోసారి విచారణకు హాజరుకావాలని సిట్ అధికారులు ఆదేశించారు.