TSPSC : 100 మార్కులకు పైగా వచ్చిన అభ్యర్థులకు సిట్ ఫోన్ కాల్

TSPSC : 100 మార్కులకు పైగా వచ్చిన అభ్యర్థులకు సిట్ ఫోన్ కాల్

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. కస్టడీకి తీసుకున్న నిందితులు.. ప్రవీణ్, రాజశేఖర్, డాకియా, రాజేశ్వర్, రేణుకలను హిమాయత్ నగర్ లోని సిట్ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ లో 100 మార్కులకు పైగా వచ్చిన అభ్యర్థుల జాబితాను సిట్ అధికారులు సిద్ధం చేశారు. టీఎస్పీఎస్సీ బోర్డ్ నుంచి అభ్యర్థుల సమాచారాన్ని సేకరించిన సిట్ అధికారులు.. ఫోన్ ద్వారా సమాచారం అందించి, సిట్ కార్యాలయానికి రావాలని వాళ్లను సూచించారు. విచారణకు వచ్చిన అభ్యర్థులను 15 అంశాలపై వివరాలు సేకరించారు. 

సిట్ అధికారులు.. అభ్యర్థుల బయోడేటాతో పాటు ఎడ్యుకేషన్, జాబ్ ఆర్ స్టడీ వివరాలను రికార్డ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్ని పరీక్షలు రాశారు, ఎన్ని మార్కులు వచ్చాయి అన్న దానిపై విచారణ జరుగుతోంది. యూపీఎస్సీ పరీక్షలు రాసి ఉంటే వాటి సమాచారాన్ని కూడా తీసుకున్నారు. ఎవరి సమాచారం అయితే తీసుకున్నారో.. వాళ్లను అవసరం అయితే తిరిగి విచారణకు పిలుస్తామని అభ్యర్థులకు సిట్ అధికారులు సూచించారు. జెన్యున్ గా పరీక్ష రాసిన వాళ్లకు ఎలాంటి భయం అవసరం లేదని సిట్ అధికారులు భరోసా ఇచ్చారు .