హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లో నీటి సమస్య రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. సోమవారం ఆమె పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కలెక్టర్లు, మిషన్‌భగీరథ సూపరింటెండింగ్ ఇంజినీర్లు, జిల్లా పంచాయతీరాజ్అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు.
ఈ నెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు స్పెషల్‌డ్రైవ్ చేపట్టి గ్రామాల్లో మంచినీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచాలని..అవసరమైన రిపేర్లు చేయాలని అధికారులకు సీతక్క స్పష్టం చేశారు. వార్షిక నిర్వహణ పనులు పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. అదనపు కలెక్టర్ల పర్యవేక్షణలో జిల్లా పంచాయతీ అధికారులు, మిషన్ భగీరథ కార్యనిర్వాహక ఇంజినీర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచందన్, మిషన్‌భగీరథ ఇంజినీరింగ్చీఫ్ కృపాకర్‌రెడ్డి, పంచాయతీరాజ్, మిషన్‌భగీరథ అధికారులు పాల్గొన్నారు.
