గొప్ప మనసు చాటుకున్న.. ఘట్టమనేని సితార

గొప్ప మనసు చాటుకున్న.. ఘట్టమనేని సితార

మహేష్ బాబు కూతురు సితార(Sitara) మనసు ఆకాశానికి చాటింది. ఇవాళ (జూలై 20న) పుట్టిన రోజు కాగా తన తండ్రి మహేష్ ఫౌండేషన్ లోని అమ్మాయిలతో సరదాగా గడిపింది. నమ్రత శిరోద్కర్(Namrata Shirodkar) ఇన్‌స్టాగ్రామ్‌లో సితార పుట్టినరోజు వేడుకల స్నీక్ పీక్‌ను పంచుకున్నారు.  నమ్రత ఆ ఫౌండేషన్ అమ్మాయిల గురుంచి నోట్ రాస్తూ.. 

"ఈ చిన్న అమ్మాయిలు తమ కొత్త రైడ్‌తో సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు పాఠశాల కేవలం సైకిల్ దూరంలో ఉంది.. మీ ఆలోచనాత్మకత మరియు ప్రేమతో నిండిన పెద్ద హృదయం కోసం నేను ఎప్పటికీ మిమ్మల్ని  ప్రేమిస్తుంటాను.జీవితంలో మీరు మరెన్నో సృష్టించాలి.. మీ అద్భుతమైన ప్రయాణంలో ఇటువంటి  జ్ఞాపకాలు మరెన్నో రావాలి' అని ఫౌండేషన్ లో చదువుకునే అమ్మాయిలపై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ.. సీతార కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ తెలిపింది. 

సీతార.. ఆ అమ్మాయిలతో సరదాగా మాట్లాడుతూ..ఫ్రీ టైం లో మీరందరూ ఏం చేస్తారు అని అడుగుతూ.. వారి కళ్ళలో నిజమైన ఆనందాన్ని చూడటానికి వారికి సైకిళ్లను గిఫ్ట్ గా ఇచ్చారు. మీ అందరి మధ్య  పుట్టిన రోజు వేడుకను సెలబ్రేట్ చేసుకోవడం నాకు ఎంతో హ్యాపీ అంటూ సితార తన ఫీలింగ్ ను పంచుకున్నారు. 

దీంతో సోషల్ మీడియా లో సీతారకు బర్త్ డే  విషెస్ తో పాటు..గొప్ప మనసు చాటుకున్నందుకు సామాన్యుల నుంచి సెలెబ్రెటీల వరకు ప్రశంశలు అందుతున్నాయి. రీసెంట్ గా జ్యూవెలరీ యాడ్ చేసిన సితార ఎంతో పాపులారిటీ పొందింది. ఆ యాడ్ ను న్యూ యార్క్ సిటీ లోని  టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించడం తెలిసేందే. 

ఈ యాడ్ కోసం దాదాపు రూ. కోటి రెమ్యూనరేషన్ అందుకుంది. అయితే, అమౌంట్ మొత్తాన్ని సితార ఛారిటీ కి ఇవ్వడం విశేషం. చిన్నప్పుడే ఇంత గొప్ప మనసు చాటుతున్న సితారకు మంచి ఫ్యూచర్ ఉందంటూ ఫ్యాన్స్  సోషల్ మీడియా లో కామెంట్స్ పెడుతున్నారు.