భద్రాచలంలో రామయ్యకు సువర్ణ తులసీదళ అర్చన

భద్రాచలంలో రామయ్యకు సువర్ణ తులసీదళ అర్చన

భద్రాచలం,వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామికి శనివారం సువర్ణ తులసీదళాలతో అర్చన జరిగింది. సుప్రభాత సేవ అనంతరం బాలబోగం నివేదించారు. భద్రుని మండపంలో రామపాదుకలకు పంచామృతాలతో అభిషేకం జరిపాక గర్భగుడిలో మూలవరులకు బంగారు తులసీ దళాలతో అర్చన చేశారు.

హైదరాబాదుకు చెందిన వేణుమాధవ్​,శిరీషలు శ్రీసీతారామచంద్రస్వామి నిత్యాన్నదాన పథకానికి రూ.1లక్ష విరాళం ఇచ్చారు. బేడా మండపంలో కల్యాణమూర్తులకు నిత్య కల్యాణం జరిగింది. కంకణాలు ధరించి భక్తులు కల్యాణంలో పాల్గొన్నారు. సాయంత్రం స్వామికి దర్బారు సేవ జరిగింది.