Amer khan : ఎమోషన్ విత్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్మెంట్‌తో .. సితారే జమీన్‌‌‌‌ పర్‌‌‌‌‌‌‌‌ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ రిలీజ్

Amer khan : ఎమోషన్ విత్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్మెంట్‌తో .. సితారే జమీన్‌‌‌‌ పర్‌‌‌‌‌‌‌‌ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ రిలీజ్

ఆమిర్ ఖాన్‌‌‌‌ లీడ్ రోల్‌‌‌‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘సితారే జమీన్‌‌‌‌ పర్‌‌‌‌‌‌‌‌’. ‘సబ్‌‌‌‌ కా అప్న అప్న నార్మల్‌‌‌‌’ అనేది ఉపశీర్షిక. ఆమిర్‌‌‌‌‌‌‌‌కు జంటగా జెనీలియా నటిస్తుండగా ఆర్‌‌‌‌‌‌‌‌.ఎస్‌‌‌‌.ప్రసన్న దర్శకత్వం వహిస్తున్నాడు.  ఆమిర్‌‌‌‌ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌పై ఆమిర్‌‌‌‌ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మిస్తున్నారు. దివ్య నిధి శర్మ కథను అందించారు.  మంగళవారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. టాలెంటెడ్‌‌‌‌ బాస్కెట్ బాల్ కోచ్ గుల్షన్‌‌‌‌ (ఆమీర్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌). కానీ తన కోపం, ప్రస్టేషన్, దురుసుతనం,  సీనియర్స్‌‌‌‌తో గొడవపడటం,  డ్రింక్ చేసి యాక్సిడెంట్ చేయడం లాంటి కారణాలతో పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌కు వెళ్తాడు. జడ్జి అతనిలోని టాలెంట్‌‌‌‌ గుర్తించి.. కొందరు మానసిక దివ్యాంగులకు మూడు నెలల్లో బాస్కెట్ బాల్‌‌‌‌ టీమ్‌‌‌‌గా ట్రైన్‌‌‌‌ చేయాలని తీర్పునిస్తారు. 

మానసికంగా సవాళ్లను ఎదుర్కొంటున్న వాళ్లను బాస్కెట్ బాల్‌‌‌‌ ప్లేయర్స్‌‌‌‌గా అతను ఎలా తీర్చిదిద్దాడు, తనను తాను ఎలా మార్చుకున్నాడు, ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లేంటి అనేది మూవీ మెయిన్ కాన్సెప్ట్‌‌‌‌. 2007లో వచ్చిన ‘తారే జమీన్‌‌‌‌ పర్‌‌‌‌‌‌‌‌’కి ఇది సీక్వెల్. ఎమోషనల్‌‌‌‌ కంటెంట్‌‌‌‌ అయినప్పటికీ వీలయినంత ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనింగ్‌‌‌‌గా తెరకెక్కించినట్టు అర్థమవుతోంది. ఆరోష్‌‌‌‌ దత్తా, గోపీకృష్ణ వర్మ, సంవిత్‌‌‌‌ దేశాయ్, వేదాంత్‌‌‌‌ శర్మ, ఆయుష్‌‌‌‌ భన్సాలీ, ఆశిష్‌‌‌‌ పెండ్సే, రిషి షహానీ, రిషబ్‌‌‌‌జైన్, నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్ కీలక పాత్రలు పోషించారు.