
బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ విజయవంతమైందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ స్పీచ్ సందర్భంగా ప్రకటించారు. ఈ పథకం ద్వారా అద్భుతమైన ఫలితాలను సాధించామని చెప్పారు. పాఠశాలల్లో అమ్మాయిల డ్రాపఔట్స్ బాగా తగ్గాయని చెప్పారామె. బాలికలు కొత్తగా స్కూల్‌లో చేరుతున్న సంఖ్య కూడా భారీగా పెరిగినట్లు చెప్పారు. కొన్ని స్కూళ్లలో అబ్బాయిల కన్నా అమ్మాయిలు సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపారామె.
అయితే ఈ ప్రకటనతో ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. సీతారామన్ స్పీచ్‌కు అడ్డుతగిలారు ప్రతిపక్ష ఎంపీలు.