
హైదరాబాద్, వెలుగు: పాలిసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నది. ఈ మేరకు రివైజ్డ్ షెడ్యూల్‌ను అధికారులు తాజాగా రిలీజ్ చేశారు. ఈ నెల 23న ఆన్ లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. 24న సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, 24,25వ తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంది.
28న సీట్ల అలాట్‌మెంట్ ప్రక్రియ ఉంటుంది. సీట్లు వచ్చిన విద్యార్థులు 29వరకూ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్ట్, 30లోగా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు. ఈ నెల 31 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని ప్రకటించారు. ఆగస్టు 5న స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను ప్రకటించనున్నారు.