జనవరి 26న తెలుగులోకి ‌‌‌‌‌‌‌శివ కార్తికేయన్ అయలాన్

జనవరి 26న తెలుగులోకి ‌‌‌‌‌‌‌శివ కార్తికేయన్ అయలాన్

శివ కార్తికేయన్ హీరోగా ఆర్. రవికుమార్ తెరకెక్కించిన ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘అయలాన్’. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. సంక్రాంతి సందర్భంగా తమిళనాట విడుదలైన ఈ చిత్రం, ఈనెల 26న తెలుగులో విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో శివకార్తికేయన్ మాట్లాడుతూ ‘ఇది ఇద్దరు హీరోల సినిమా. ఒక హీరో నేనైతే, మరొక హీరో ఏలియన్. నా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎక్కువ టైమ్ తీసుకున్న సినిమా ఇదే. ఎందుకంటే ఇందులో 4500 విఎఫ్‌‌‌‌‌‌‌‌ఎక్స్ షాట్స్ ఉన్నాయి.

దాదాపు తొంభై శాతం సీన్స్‌‌‌‌‌‌‌‌లో గ్రాఫిక్స్ ఉన్నాయి. డెబ్భై శాతం సీన్స్​లో ఏలియన్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. రోబో, 2.0 చిత్రాల కంటే ఎక్కువ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న చిత్రమిది. కానీ మా బడ్జెట్ తక్కువ. అందుకే ఎక్కువ రోజులు పట్టింది. సరైన టీమ్, ఐడియా ఉంటే తక్కువ బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో కూడా తీయొచ్చు. ఈ తరహా సినిమాలు ఎన్ని వచ్చినా, ఏలియన్  –మనిషి మధ్య సీన్స్‌‌‌‌‌‌‌‌, వాళ్ళిద్దరి ఇంటరాక్షన్, సినిమా కోర్ పాయింట్‌‌‌‌‌‌‌‌ చాలా కొత్తగా ఉంటాయి. ఇదొక సినిమాలా ఉండదు.. మీరు ఒక థీమ్ పార్క్‌‌‌‌‌‌‌‌లోకి  వెళ్లినట్టు ఉంటుంది.

రెండున్నర గంటలు హాయిగా ఎంజాయ్ చేసే విజువల్ ఫీస్ట్ ఇది. యూనివర్సల్ కాన్సెప్ట్ ఉన్న సినిమా కనుక అన్ని ప్రాంతాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. తమిళనాడు తరహాలోనే తెలుగులోనూ సూపర్ హిట్ అవుతుందని నమ్మకం ఉంది. దీనికి సీక్వెల్ ఐడియా ముందు నుంచీ ఉంది. సీక్వెల్ ఇంకా బిగ్గర్ స్కేల్‌‌‌‌‌‌‌‌లో చేస్తాం. ప్రస్తుతం కమల్ హాసన్‌‌‌‌‌‌‌‌ గారి నిర్మాణంలో నేను, సాయిపల్లవి కలిసి నటిస్తున్న సినిమా ఎనభై శాతం షూటింగ్ పూర్తయింది. సమ్మర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిలీజ్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది’ అని చెప్పాడు.