రాత్రి 11 గంటలకు రమ్మన్నది..రాలేనని చెప్పేశా

రాత్రి 11 గంటలకు రమ్మన్నది..రాలేనని చెప్పేశా

టాలీవుడ్, బాలీవుడ్..ఏ వుడ్ అయినా..కాస్టింగ్ కౌచ్ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కాస్టింగ్ కౌచ్ బారిన పడిన ఎంతో మంది హీరోయిన్లు..కారెక్టర్ అర్టిస్టులు..అవకాశాల వేటలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. అయితే ఇన్నాళ్లు మహిళలే కాస్టింగ్ కౌచ్ గురించి ఆరోపణలు చేయగా..ఇటీవల నటులు కూడా మహిళలపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే తాను కూడా  కాస్టింగ్ కౌచ్‌ బాధితున్నే అంటూ  నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ స్పష్టం చేయగా..తాజాగా బుల్లితెర నటుడు బిగ్ బాస్ 16 రన్నరప్ శివ ఠాక్రే  తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ సంఘటనని వివరించాడు. కెరీర్‌ తొలినాళ్లలో క్యాస్టింగ్‌ కౌచ్‌ను ఎదుర్కొన్నానంటూ  శివ ఠాక్రే  సంచలన వ్యాఖ్యలు చేశాడు.  

ఆడిషన్లో మసాజ్ సెంటర్..

ఒక సారి ఆరమ్‌ నగర్‌కు ఆడిషన్‌ కోసం వెళ్లాను. ఓ  డైరెక్టర్‌ నన్ను బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి..అక్కడ మసాజ్‌ సెంటర్‌ ఉందని చెప్పాడు. ఆడిషన్‌కు వస్తే మసాజ్‌ సెంటర్‌ అంటున్నాడు ఏంటబ్బ అని అనుకున్నా..ఆడిషన్‌ పూర్తయ్యాక..మసాజ్‌ సెంటర్‌కు రా..,నీతో పనుంది అని చెప్పాడు.  అవకాశాల కోసం నేను అప్పటికే ఎంతో కష్టపడ్డాను. కానీ అందుకోసం అలాంటి పని చేయడం ఇష్టం లేదు. దీంతో అక్కడి నుంచి వెంటనే బయటకు వచ్చేశా...

11 గంటలకు రమ్మంది...

ఆడిషన్ కు రావాలంటూ ఓ సారి  మహిళ నుంచి  అర్థరాత్రి 11 గంటలకు పిలుపొచ్చింది. ఆమెకు నాలుగు బిల్డింగ్ లు ఉన్నాయని చెప్పింది. ఇండస్ట్రీలో ఎంతో మందిని స్టార్లను చేశానని గొప్పలు చెప్పింది.. అయితే  రాత్రి 11 గంటలకు ఆడిషన్‌ ఉంది రావాలని చెప్పింది.. ఆమె ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది.. వెంటనే  అర్ధరాత్రి ఆడిషన్‌ ఏంటి..? నాకు పని ఉందండి..,రాలేనని చెప్పేశా... దీంతో ఆమెకు కోపం వచ్చింది.  నీకు సినిమాలు చేయాలని లేదా.. రాత్రికి రాకపోతే నీకు అవకాశాలు దొరకవు అని బెదిరించింది. అయినా లెక్కచేయలేదు.. అని శివ ఠాక్రే చెప్పుకొచ్చాడు.

హిందీ బిగ్‌బాస్‌ 16 సీజన్‌తో ఫుల్‌ పాపులారిటీ తెచ్చుకున్నాడు శివ ఠాక్రే. బిగ్‌బాస్‌ 16వ సీజన్‌ రన్నరప్‌గా నిలిచిన శివ ఠాక్రే ..బిగ్‌బాస్‌ మరాఠీ, ఎమ్‌టీవీ రోడీస్‌ రైడింగ్‌ షోలో మెరిశాడు. ఇప్పుడిప్పుడే అవకాశాలు అందిపుచ్చుకుంటూ కెరీర్‌లో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.