Madharaasi Censor: శివ కార్తికేయన్ ‘మదరాసి’ సెన్సార్ రివ్యూ.. బలమైన కథతో డైరెక్టర్ మురుగదాస్!

Madharaasi Censor: శివ కార్తికేయన్ ‘మదరాసి’ సెన్సార్ రివ్యూ.. బలమైన కథతో డైరెక్టర్ మురుగదాస్!

హీరో శివ కార్తికేయన్ అప్ కమింగ్ రిలీజ్ మూవీ ‘మదరాసి’ (Madharaasi). రుక్మిణీ వసంత్ హీరోయిన్. డైరెక్టర్ మురుగదాస్ తన మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించాడు. ఇప్పటికే టీజర్‌‌‌‌‌‌‌‌, ట్రైలర్తో మంచి బజ్‌‌‌‌ని క్రియేట్ చేశారు. సెప్టెంబర్ 5న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో మదరాసి సెన్సార్ కంప్లీట్ చేసుకున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పోస్టర్ రిలీజ్ చేసి వివరాలు వెల్లడించారు.

‘మదరాసి’సెన్సార్:

లేటెస్ట్గా ‘మదరాసి’ మూవీ సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ మూవీకి యూ/ఏ (U/A) సర్టిఫికేట్ జారీ చేసింది. 2 గంటల 47 నిమిషాల భారీ రన్‌టైమ్తో మూవీ రానుంది. ఈ సినిమా చూసిన సెన్సార్ బృందం నుంచి ప్రశంసలతో పాటు కొన్ని సీన్స్కి కటింగ్స్ కూడా పడినట్లు టాక్. ఇందులో కొన్ని హింసాత్మక సన్నివేశాలను, రక్తపాతంత కూడిన సీన్లపై వారు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. కొన్ని డైలాగ్స్లో కూడా కటింగ్స్ పడినట్లు టాక్. 

కథ విషయానికి వస్తే..

‘మదరాసి’ మూవీ యాక్షన్ ప్యాక్డ్ డ్రామాగా తెరకెక్కింది. తమిళనాడులో నార్త్ ఇండియా మాఫియా, రెండు స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ మధ్య జరిగే కథ ఇదని టాక్ . ఇందులో శివకార్తీకేయన్ రఘు అనే పాత్రలో నటిస్తున్నాడు. మాఫియాను ఎదురించే యువకుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కథలో లవ్, పగ, ప్రతీకారం, త్యాగం, ఫ్రెండ్‌షిప్, రెండు గ్రూపుల మధ్య వార్ లాంటి అంశాలు హైలెట్‌ అని సెన్సార్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

డైరెక్టర్ మురుగదాస్ తనదైన శైలిలో ఫుల్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ కంటెంట్తో మూవీ తెరకెక్కించాడని అంటున్నారు. ఇది మురుగదాస్ రీసెంట్ సినిమాల మాదిరి కాకుండా, ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇచ్చే విధంగా ఉంటుందని సమాచారం. ఈ క్రమంలోనే ‘మదరాసి’తో డైరెక్టర్ మురుగదాస్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడని సినీ క్రిటిక్స్ మాట్లాడుకుంటున్నారు. 

కలవర పెట్టె రన్‌టైమ్:

ఈ మూవీ భారీ రన్‌టైమ్తో వస్తుండటం సినీ ఫ్యాన్స్ను కలవరపెడుతోంది. ఏకంగా 2 గంటల 47 నిమిషాలతో వస్తుంది. కంటెంట్లో స్ట్రాంగ్ పాయింట్ లేకపోతే.. ఆకట్టుకోవడం కష్టం అవుతుందని క్రిటిక్స్ భావిస్తున్నారు. ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలకు ఇంతటి భారీ రన్ టైం బాగా అలవాటుగా మారింది. కానీ, అదే టైంలో చూసే వారికి బాగా హెడేక్గా కూడా మారింది. కథలో దమ్ముంటే మాత్రమే ఆడియన్స్ ఎంతసేపైనా చూస్తున్నారు. అంతేకాదు.. ఎన్ని భాగాలుగా వచ్చిన చూస్తారు. అందుకు చాలా సినిమాలు నిదర్శంగా నిలిచాయి. అలాగే, భారీ రన్ టైంతో వచ్చి ప్లాప్ అయినా సినిమాలు కూడా చాలానే ఉన్నాయి.

►ALSO READ | Samantha: 'నాగ్ మామే అందగాడు'.. సమంత కామెంట్స్ వైరల్

ఎందుకంటే.. సినిమా సక్సెస్ని కొన్నిసార్లు ఈ రన్ టైం కూడా డిసైడ్ చేస్తుంది. అనవసరమైన ల్యాగింగ్ సీన్స్ పెట్టడం వల్ల సినిమా గాడి తప్పి ఎటో వెళ్తుంది. ఈ క్రమంలోనే మదరాసి రన్ టైం, శివ కార్తికేయన్ ఫ్యాన్స్లో టెన్షన్ పుట్టిస్తుంది. అయితే, ఈ రన్ టైం (2 గంటల 47 నిమిషాలు) ఎక్కడ కూడా బోర్ కొట్టించేలా ఉండదని మేకర్స్తో పాటుగా సెన్సార్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. చూడాలి మరి సక్సెస్ కోసం కసిగా ఉన్న మురుగదాస్ ఏం చేస్తాడో!

ఈ సినిమాలో విద్యుత్ జామ్వాల్, బిజు మీనన్, షబీర్, విక్రాంత్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీలక్ష్మీ మూవీస్ సంస్థ గ్రాండ్ స్కేల్‌‌‌‌లో నిర్మించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా.. సుదీప్ ఎలామోన్ సినిమాటోగ్రాఫర్‌‌‌‌గా వ్యవహరించారు. 

'U/A' సర్టిఫికేట్: ఎవరైనా  దీన్ని చూడవచ్చు.. కాకపోతే 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఈ చిత్రాన్ని వారి తల్లిదండ్రులతో కలిసొ లేదా పెద్దల తోడుతో చూడాలని సూచిస్తారు. ఈ సర్టిఫికేట్ పొందిన సినిమాల్లో హింసాత్మక యాక్షన్ సన్నివేశాలు,  కొంతవరకు నగ్నత్వం ఉంటుంది.