Madharaasi Review: శివకార్తికేయన్ ‘మదరాసి’ X రివ్యూ.. డైరెక్టర్ మురుగదాస్ మూవీ ఎలా ఉందంటే?

Madharaasi Review: శివకార్తికేయన్ ‘మదరాసి’ X రివ్యూ.. డైరెక్టర్ మురుగదాస్ మూవీ ఎలా ఉందంటే?

శివకార్తికేయన్, రుక్మిణీ వసంత్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మదరాసి’. డైరెక్టర్ మురుగదాస్ తన మార్క్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కించాడు. ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఇవాళ (సెప్టెంబర్ 5న) ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేశారు.

ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్, తుపాకీ ఫేమ్' విద్యుత్ జమ్వాల్ విలన్ రోల్లో నటించాడు. మలయాళ నటుడు బిజు మీనన్, విక్రాంత్, షాబీర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రీమియర్లు ఓవర్సీస్లో ప్రదర్శించబడ్డాయి. ఈ క్రమంలో మూవీ చూసిన ఆడియన్స్ నుంచి ఎలాంటి టాక్ వస్తుందో X రివ్యూలో తెలుసుకుందాం.

కథ విషయానికి వస్తే..

‘మదరాసి’ మూవీ యాక్షన్ ప్యాక్డ్ డ్రామాగా తెరకెక్కింది. తమిళనాడులో నార్త్ ఇండియా మాఫియా, రెండు స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ మధ్య జరిగే కథ ఇదని టాక్. ఇందులో శివకార్తీకేయన్ రఘు అనే పాత్రలో నటిస్తున్నాడు. మాఫియాను ఎదురించే యువకుడి పాత్రలో కనిపించనున్నారు. అంతేకాకుండా.. రఘు తన ప్రియురాలిని కాపాడేందుకు క్రిమినల్ ప్రపంచంలో అడుగుపెట్టాల్సి వస్తుంది. కానీ అతని అస్థిరమైన మనస్తత్వం అతన్ని హింస వైపు నడిపిస్తుంది.

ఈ క్రమంలో అతను హీరోనా లేదా విలనా అనే సందేహం పెంచేలా తన క్యారెక్టర్ డిజైన్ చేసాడట మురుగదాస్. ఓవరాల్ గా ఈ సినిమా కథలో లవ్, పగ, ప్రతీకారం, త్యాగం, ఫ్రెండ్‌షిప్, రెండు గ్రూపుల మధ్య వార్ లాంటి అంశాలు హైలెట్‌ అని నెటిజన్ల రివ్యూలు చెబుతున్నాయి.

డైరెక్టర్ మురుగదాస్ తనదైన శైలిలో ఫుల్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ కంటెంట్తో మూవీ తెరకెక్కించాడని అంటున్నారు. ఇది మురుగదాస్ రీసెంట్ సినిమాల మాదిరి కాకుండా, ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇచ్చే విధంగా ఉంటుందని సమాచారం.

అనిరుధ్ రవిచందర్ BGM సినిమాకు సినిమా స్థాయిని పెంచిందని అంటున్నారు. ఈ క్రమంలోనే ‘మదరాసి’తో డైరెక్టర్ మురుగదాస్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడని సినీ క్రిటిక్స్ మాట్లాడుకుంటున్నారు.

ఓ నెటిజన్ తన రివ్యూను పంచుకుంటూ.. "కొన్ని ఓల్డ్ బ్యాక్ డ్రాప్ లో, భయపెట్టే సీన్స్ తో పాటుగా, అట్ట్రాక్ట్ చేసే కామెడీతో ఫస్టాఫ్ సాగింది. సెకండాఫ్ మొత్తం యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో ఉంది. అనిరుధ్ మ్యూజిక్ సినిమాకి వెన్నెముక. డైరెక్టర్ మురుగదాస్ రాసుకున్న స్క్రీన్ ప్లే డిఫెరెంట్ గా ఉంది. లవ్, క్రైమ్, కొన్నిచోట్ల నవ్వించే కామెడీతో సినిమా ప్రధానంగా సాగింది. హీరో శివకార్తికేయన్ నటన ఆకట్టుకుంటుందని" తెలిపారు.

అయితే, సినిమాకు చెప్పుకోదగ్గ హై లెవల్ టాక్ మాత్రం రావట్లేదు. మిక్సెడ్ రివ్యూలు ఇస్తున్నారు. అందులో ఓ నెటిజన్ తన రివ్యూ షేర్ చేస్తూ.. "హీరో శివకార్తికేయన్ నటన బాగుంది. రుక్మిణి వసంత్ నటన పర్వాలేదు. విలన్ విద్యుత్ కూడా బాగా చేశాడు. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ సినిమాకు ఆసక్తిరేపే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ లో నటుడు బిజు మీనన్ నటన బాగుంది. అక్కడక్కడా ఊహించదగిన సన్నివేశాలతో ల్యాగ్ అనే ఫీలింగ్ ఇస్తుంది. డైరెక్టర్ మురుగదాస్ ఇంకాస్త బలంగా క్లైమాక్స్ రాసుకునే ఉంటే, సినిమా ఇంకా బాగుండేదని" అభిప్రాయం వ్యక్తం చేశాడు.