కొత్త డైరెక్టర్ శివకుమార్ మురుగేశన్ (Sivakumar Murugesan) అదిరిపోయే ఛాన్స్ కొట్టేశాడు. రాధికా శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘తాయి కిళవి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ఆయన, తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హీరో శివకార్తికేయన్ నిర్మించిన ఈ చిత్రం సుమారు రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, రూ.75 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ఈ క్రమంలోనే హీరో శివ కార్తికేయన్.. తనకి కోట్ల లాభాలను అందించిన శివకుమార్కి మరో భారీ ప్రాజెక్ట్ ఇచ్చి మంచు మనసు చాటుకున్నాడు. అంతేకూండా తానే హీరోగా నటిస్తూ శివకుమార్ మురుగేశన్ని స్టార్ డైరెక్టర్స్ వరుసలో నిలబెట్టాలని ఫిక్స్ అయ్యాడు. దానికితోడు ఈ చిత్రాన్ని విశ్వనటుడు కమల్ హాసన్ నిర్మిస్తుండటంతో మరిన్ని అంచనాలు పెరిగాయి.
ఇప్పటికే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ‘సేయోన్’ (Seyon) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ప్రకటించారు. తాజాగా కొత్త పోస్టర్ షేర్ చేసి సినిమా షూటింగ్ అప్డేట్ ఇచ్చారు. ఇవాళ మే18 నుంచి సేయోన్’ షూటింగ్ అధికారికంగా ప్రారంభమైనట్లు మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం తొలి షెడ్యూల్ చెన్నైలో జరుగుతుండగా, తర్వాతి షెడ్యూల్స్‌ను ఇతర ప్రాంతాల్లో నిర్వహించనున్నారని వెల్లడించారు.
#SEYON Begins
— Raaj Kamal Films International (@RKFI) May 18, 2026
The Celebration Starts#சேயோன் #OneMoreTime #KamalHaasan #Sivakarthikeyan @ikamalhaasan @Siva_Kartikeyan #Mahendran @Dir_SivakumarM @Music_Santhosh #BhagyashriBorse @RKFI @turmericmediaTM @bala_actor @vivekvdop @Sanlokesh @supremesundar #ArunVenjaramoodu… pic.twitter.com/WdSxI2Ekh5
ఇక పోస్టర్‌ను బట్టి చూస్తే, ఈ సినిమా పురాణాల స్ఫూర్తితో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో శివకార్తికేయన్ పాత్రలో ఓ ఆసక్తికరమైన మిస్టరీ ఎలిమెంట్ ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆయన పాత్రకు దేవుడు మురుగన్ లేదా విరుమాండి సంబంధం ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. ‘సెయాన్’ అంటే తమిళంలో మురుగన్ అని అర్థం. ఈ క్రమంలోనే దేవుడు మురుగన్ టచ్ ఉంటుందని టాక్.
రూరల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుంది. బాల సరవణన్, అరుల్‌దాస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ‘అమరన్’ సక్సెస్ తర్వాత కమల్ హాసన్ బ్యానర్‌లో శివకార్తికేయన్ నటిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. 2026 అక్టోబర్‌లో మూవీ థియేటర్లలోకి రానుంది.
Tomorrow, #SEYON Begins Its Journey#சேயோன் #OneMoreTime #KamalHaasan #Sivakarthikeyan @ikamalhaasan @Siva_Kartikeyan #Mahendran @Dir_SivakumarM #BhagyashriBorse @RKFI @turmericmediaTM @bala_actor @vivekvdop @Sanlokesh @supremesundar #ArunVenjaramoodu #DineshManoharan… pic.twitter.com/c1piPpK9ct
— Raaj Kamal Films International (@RKFI) May 17, 2026
