
కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ (Shiva Karthikeyan) గురించి, ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్, ప్రిన్స్, మహావీరుడు సినిమాలు తెలుగులో సూపర్ సక్సెస్ అయ్యాయి.దీంతో ఆయన సినిమాలకు ఇక్కడ కూడా మంచి డిమాండ్ ఏర్పడింది.
రీసెంట్గా శివ కార్తికేయన్ హీరోగా ఆడియన్స్ ముందుకు వచ్చి ఆకట్టుకున్నసైన్స్ ఫిక్షన్ ఫాంటసీ మూవీ అయలాన్ (Ayalaan).తమిళంలో సంక్రాంతికి థియేటర్లలో రిలీజై రూ.100 కోట్ల కలెక్షన్స్తో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.కాగా ఈ సినిమా జనవరి 26న తెలుగు థియేటర్లలో రిలీజై ఆడియన్స్ను ఆకట్టుకుంది.
ALSO READ: Sudheer Sarkaar S4: సుధీర్ న్యూ సర్కార్..ఆడే ఆట అదిరిపోవాలి అంతే
సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఆర్.రవికుమార్ (R Ravikumar)తెరెకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే తమిళ వర్షన్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సన్నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతోంది.కానీ,తెలుగు ఓటీటీకి కాస్తా లేట్ అవుతుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ నెల (ఏప్రిల్ 19న)స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి.త్వరలో అయలాన్ తెలుగు స్ట్రీమింగ్పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.