ఢిల్లీలోనే ఆరుగురు మంత్రులు మకాం

ఢిల్లీలోనే ఆరుగురు మంత్రులు మకాం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో  బీఆర్ఎస్  ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.  దాదాపుగా గత ఆరు గంటలు పైగా విచారణ కొనసాగుతోంది. ముందుగా సింగిల్ గా కవితను విచారించిన అధికారులు ఆ తరవాత పిళ్లై, సిసోడియాతో  కలిపి విచారిస్తున్నారు. కవిత విచారణ రాత్రి 8  గంటల వరకు  జరగనున్నట్టు సమాచారం.  మరోవైపు  ఢిల్లీలోనే ఆరుగురు మంత్రులు మకాం వేశారు. న్యాయనిపుణలతో  ఎప్పటికప్పుడు మంత్రులు కేటీఆర్, హరీష్ మంతనాలు జరుపుతున్నారు. మంత్రలతో పాటుగా స్టేట్ ఇంటెలిజిన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా ఢిల్లీలోనే ఉన్నారు.