అస్సాం, మిజోరం బోర్డర్ కాల్పుల్లో ఆరుగురు పోలీసులు మృతి

అస్సాం, మిజోరం బోర్డర్ కాల్పుల్లో ఆరుగురు పోలీసులు మృతి

ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం-మిజోరంల సరిహద్దుల్లో హింస చెలరేగింది. స్థానిక ప్రజలు, భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణలు జరిగాయి. దీంతో అస్సాంకు చెందిన ఆరుగురు పోలీసులు చనిపోయారు. అస్సాంలోని కాచర్ జిల్లా, మిజోరంలోని కొలాసిబ్ జిల్లాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. కాల్పులు జరగడంతో... ఆరుగురు పోలీసులు చనిపోవడంతో పాటు... అనేక మంది గాయపడ్డారు. 

ఈ ఇష్యూలో అస్సాం, మిజోరం సీఎంల మధ్య ట్వీట్ల యుద్ధం నడిచింది. అస్సాం మీదుగా మిజోరం వస్తున్నవారిపై అక్కడి ప్రజలు దాడులు చేస్తున్నారని ఫస్ట్ ట్వీట్ చేశారు మిజోరం సీఎం జోరంతంగ. ఈ ట్వీట్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ట్యాగ్ చేశారు. జోక్యం చేసుకుని దాడులను ఆపాలని అమిత్ షాను కోరారు. ఈ ట్వీట్ కు అస్సాం హిమంత్ బిశ్వ శర్మ రిప్లై ఇచ్చారు. హింస ఆపబోమని ప్రజలంటున్నారని... ఇలాంటి పరిస్థితుల్లో తాము ప్రభుత్వాన్ని ఎలా నడపగలమని ప్రశ్నించారు. ఇలా వరుస ట్వీట్లతో ఒకరినొకరు నిందించుకున్నారు.  అయితే ఈ అంశంలో కలుగజేసుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా... ఇద్దరు సీఎంలతో ఫోన్ లో మాట్లాడారు. బోర్డర్ లో పరిస్థితులను చక్కదిద్దాలని సూచించారు. ప్రస్తుతానికి కొలాసిబ్-కాచర్ జిల్లాల సరిహద్దుల్లో హింస ఆగినప్పటికీ... పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయి.