కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం

కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులతో ఉలిక్కిపడింది. కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఓ దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఆరుగురు స్పాట్లోనే చనిపోగా.. 9 మందికి తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల శబ్దానికి స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దుండగుడు సెకన్ల వ్యవధిలోనే 50 రౌండ్ల కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని దగ్గరలోని హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కాల్పులకు పాల్పడిన దుండగుడి కోసం పోలీసులు వేట ప్రారంభించారు.

For more news...

పబ్‎లో ప్రముఖులు.. లైవ్ అప్‎డేట్స్

డ్రగ్స్‌ వ్యవహారం.. బంజారాహిల్స్ సీఐ సస్పెన్షన్