నార్సింగ్ మున్సిపల్ కమిషనర్​కు 6 నెలల జైలు శిక్ష

నార్సింగ్ మున్సిపల్ కమిషనర్​కు 6 నెలల జైలు శిక్ష

హైదరాబాద్, వెలుగు :  కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన విశ్వభారతి ఎడ్యుకేషనల్‌ సొసైటీ అధ్యక్షుడు ఎం రత్నారెడ్డికి, అక్రమ నిర్మాణాలను పాక్షికంగా కూల్చిన నార్సింగ్‌ మున్సిపల్‌ కమిషనర్‌ పి.సత్యబాబుకు హైకోర్టు 6 నెలల జైలు శిక్ష, రూ.2  వేల చొప్పున జరిమానా విధించింది. 2021, అక్టోబర్​27న ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా రత్నారెడ్డి నిర్మాణాలు చేశారని, వాటిపై కమిషనర్‌ సత్యబాబు చర్యలు తీసుకోలేదని కోర్టు తప్పు పట్టింది. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో సర్వే నంబర్​ 96: 180, 400లో రెండు ఎకరాల భూమిలో రత్నారెడ్డి చేపట్టిన నిర్మాణాలు కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉన్నాయని మిర్చుమల్‌ చెల్లారాం మంఘ్నాని కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని విచారించిన హైకోర్టు పై తీర్పును వెలువరించింది.