జనావాసాలపై పాక్ కాల్పులు.. ఆర్మీ ఆఫీసర్ వీరమరణం

జనావాసాలపై పాక్ కాల్పులు.. ఆర్మీ ఆఫీసర్ వీరమరణం
జమ్మూ: బార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శనివారం సాయంత్రం వరకు పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు. వీరిలో జమ్మూకాశ్మీర్ ప్రభుత్వ అధికారి, ఆర్మీ జూనియర్ కమిషన్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్ ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు బార్డర్ వెంబడి పాక్ కాల్పులకు తెగబడింది. జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పలు ప్రాంతాల్లో జనావాసాలే లక్ష్యంగా విచక్షణారహితంగా కాల్పులు జరిపింది.
 
పూంచ్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మన ఆర్మీ పోస్టుకు దగ్గర్లో జరిగిన పేలుడులో సుబేదార్ మేజర్ పవన్ కుమార్ వీరమరణం చెందాడు. ఇతని స్వస్థలం హిమాచల్ ప్రదేశ్. ఇక రాజౌరీ టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అడిషనల్ డిస్ట్రిక్ట్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కమిషనర్ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్ థాప ఇంటిపై బాంబులు వేయడంతో తీవ్రమైన గాయాలతో ఆయన చనిపోయారు. మరో ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు. రాజౌరీలోని ఇండస్ట్రియల్ ఏరియా లక్ష్యంగా పాక్ జరిపిన కాల్పుల్లో రెండేండ్ల పాప సహా ఇద్దరు చనిపోయారు. ఇక్కడ ముగ్గురు గాయపడ్డారు. పాక్ ప్రయోగించిన మోర్టార్ షెల్ ధాటికి పూంచ్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఓ ఇల్లు ధ్వంసమై 55 ఏండ్ల మహిళ మరణించింది. జమ్మూ శివారులో పాక్ జరిపిన కాల్పుల్లో మరో వ్యక్తి చనిపోయాడు. వివిధ ప్రాంతాల్లో పాక్ జరిపిన కాల్పుల్లో మొత్తం ఆరుగురు చనిపోగా, 20 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. 

బాధితులకు సీఎం పరామర్శ.. 

పాక్ షెల్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వల్ల ధ్వంసమైన ప్రాంతాలను జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. పాక్ కాల్పుల్లో చనిపోయినోళ్ల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రభుత్వ అధికారి రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్ థాప మృతిపై సీఎం దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఒక గొప్ప ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.