కనకగిరి గుట్టల్లో ఆరుగురు స్మగ్లర్లు అరెస్టు

కనకగిరి గుట్టల్లో ఆరుగురు స్మగ్లర్లు అరెస్టు

తల్లాడ, వెలుగు :  తల్లాడ రేంజ్ పరిధిలో చండ్రుగొండ మండలం బెండలపాడు కనకగిరి గుట్టల్లో ఆరుగురు వన్యప్రాణుల స్మగ్లర్లను ఫారెస్ట్ అధికారులు అరెస్టు చేశారు. ఆదివారం డీఎఫ్ వో సిద్ధార్థ విక్రమ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 9 గంటల సమయంలో  పక్కా సమాచారంతో డీఆర్ వో కేవీ రామారావు, ఎఫ్ బీవోలు లావణ్య, ఎఫ్ నాగరాజు స్ట్రైక్ ఫోర్స్ సిబ్బందితో కలిసి కనకగిరి గుట్టల్లో గాలింపు చర్యలు పట్టారు.  

గుర్తుతెలియని వ్యక్తులు ఆరుగురు అడవిలోకి వచ్చినట్టు గుర్తించి వారిని అర్థరాత్రి సమయంలో అదుపులోకి తీసుకున్నారు. వారిలో నలుగురు హైదరాబాద్​కు, ఇద్దరు జిల్లాలోని చుండ్రుగుండ్ల మండలం బెండలపాడుకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వారి నుంచి  స్నైపర్ గన్, వేట కత్తి, గొడ్డలి ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వెంట లోకల్ రాజకీయ నాయకులు ఉన్నట్లు ఆఫీసర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.