ఆరుగురు గ్రామ సెక్రటరీలకు ఢిల్లీ ఆహ్వానం

ఆరుగురు గ్రామ సెక్రటరీలకు ఢిల్లీ ఆహ్వానం
  •  పంద్రాగస్టు వేడుకలకు కేంద్ర పంచాయతీ రాజ్​శాఖ పిలుపు

హైదరాబాద్, వెలుగు: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రం నుంచి ఆరుగురు కార్యద ర్శులను కేంద్రం ఢిల్లీలోని ఎర్రకోటలో పంద్రాగ స్టు వేడుకలకు ఆహ్వానించింది. 2023, 2024, 2025లో జాతీయ అవార్డులు గెలుచు కున్న పంచాయతీల కార్యదర్శులను కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నామినేట్ చేసింది. వీరికి పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) వీరబుచ్చయ్య నోడల్ అధి కారిగా వ్యవహరించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌతంపూర్ ఆరోగ్యకర పంచా యతీ(2023) అవార్డు దక్కించుకున్నది.

ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి జె.షర్మిల, జనగామ జిల్లా నెల్లుట్ల పంచాయతీ నీటి సమృద్ధి పంచాయతీ (2023) అవార్డు దక్క గా.. సెక్రటరీ ఆర్.శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్‌‌ నగర్ జిల్లా కొంగట్‌‌పల్లి సామాజిక భద్రతా పంచాయతీ (2023) అవార్డు అందుకోగా.. సెక్రటరీ  వి.శ్రీనివాస్, జోగులాంబ గద్వాల జిల్లా మందొడ్డి పేదరిక రహిత, జీవనోపాధి పంచా యతీ (2023) అవార్డు దక్కించుకోగా.. సెక్రటరీ ఎం.దస్తగిరి, పెద్దపల్లి జిల్లా చిల్లపల్లి మహిళా స్నేహపూర్వక పంచాయతీ (2024) అవార్డుకు ఎంపికైంది. ఆ విలేజ్ సెక్రటరీ ఆర్.రామ్‌‌కిశోర్, రంగారెడ్డి జిల్లా మాల్ గ్రామం ఆత్మ నిర్భర్ పంచాయతీ (2025) ప్రత్యేక అవార్డు కైవసం చేసుకోగా.. సెక్రటరీ వైవీ రాజును ఢిల్లీలో జరిగే స్వాతంత్ర్య వేడుకలకు ఆహ్వానించింది.