రేపు యూపీలో ఆరో విడత పోలింగ్

రేపు యూపీలో ఆరో విడత పోలింగ్

లక్నో: ఉత్తర్ప్రదేశ్లో ఆరో విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. అంబేడ్కర్ నగర్, బల్రాంపూర్,సిద్ధార్థ్ నగర్, బస్తీ, సంత్కబీర్ నగర్, మహారాజ్గంజ్, గోరఖ్పూర్, ఖుషీనగర్, బలియా, దియోరియా జిల్లాల్లోని 57 నియోజకవర్గాల్లో గురువారం ఎన్నిక జరగనుంది. 2.14 కోట్ల మంది ఓటర్లు 676 మంది భవితవ్యాన్నిఈవీఎంలలో భద్రపర్చనున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తుండగా.. ఆయన బరిలో నిలిచిన గోరఖ్పూర్ నియోజకవర్గంలో ఇదే దశలో ఓటింగ్ జరగనుంది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ, బీజేపీకి గుడ్ బై చెప్పి సమాజ్వాదీ పార్టీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్య కూడా ఈ దశలోనే అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.  

యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలుండగా.. గత ఐదు దశల్లో 292 సీట్లలో ఓటింగ్ పూర్తైంది. పూర్వాంచల్లోని 57 నియోజకవర్గాల్లో రేపు ఓటింగ్ జరగనుంది. మిలిగిన 54 నియోజకవర్గాల్లో మార్చి 7న ఎన్నిక నిర్వహించనున్నారు. మార్చి 10న ఫలితాలు వెలువడుతాయి. 

మరిన్ని వార్తల కోసం..

ఇండియన్స్‌.. వెంటనే ఖర్కివ్ సిటీ నుంచి బయటపడండి

ఉక్రెయిన్‌లో మరో విద్యార్థి మృతి