విక్రమ్‌‌ మూవీలో ఎస్‌‌జే సూర్య కీలక పాత్ర

విక్రమ్‌‌ మూవీలో ఎస్‌‌జే సూర్య కీలక పాత్ర

ఒకప్పుడు దర్శకుడిగా రాణించిన ఎస్‌‌జే సూర్య.. ప్రస్తుతం నటుడిగా బిజీగా ఉన్నాడు. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. తాజాగా విక్రమ్‌‌ హీరోగా నటిస్తున్న చిత్రంలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారు.

ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వంలో విక్రమ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో విక్రమ్‌‌తో పాటు  ఎస్‌‌జే సూర్య పవర్‌‌‌‌ఫుల్ క్యారెక్టర్‌‌‌‌ పోషిస్తున్నట్టు  రివీల్ చేశారు. ఈ చిత్రంలో ఎస్‌‌జె సూర్య మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపిస్తాడని మూవీ టీమ్ చెప్పింది.

దీంతో ఈ క్రేజీ కాంబోపై  అంచనాలు పెరిగాయి. విక్రమ్ నటిస్తున్న 62వ సినిమా ఇది. శిబు థమీన్ కూతురు రియా శిబు భారీ బడ్జెట్‌‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.  హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.