
న్యూఢిల్లీ: స్పెషాలిటీ కెమికల్స్ తయారీ కంపెనీ ఎస్‌కే మినరల్స్ అండ్ అడిటివ్స్ ఐపీఓకి వచ్చేందుకు బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ వద్ద డ్రాఫ్ట్ పేపర్లను దాఖలు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 28న దాఖలు చేసిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) ప్రకారం, ఈ ఐపీఓలో పూర్తిగా 32.4 లక్షల ఈక్విటీ షేర్ల ఫ్రెష్ ఇష్యూ ఉంటుంది. ప్రతి షేరు ఫేస్ వాల్యూ రూ.10. కంపెనీ షేర్లు బీఎస్‌ఈ ఎస్‌ఎంఈలో లిస్ట్ కానున్నాయి. ఐపీఓ సైజ్ రూ.31 కోట్లు అని ఎస్‌కే మినరల్స్ తెలిపింది.