Chandrababu skill case: మాజీ ఎంపీ ఉండవల్లి పిటిషన్ విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే ..

Chandrababu skill case:  మాజీ ఎంపీ ఉండవల్లి  పిటిషన్ విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే ..

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (Skill Development Case) విచారణను సీబీఐకు (CBI) ఇవ్వాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Former MP Undavalli Arunkumar) వేసిన పిటీషన్‌పై విచారణను హైకోర్టు (AP HighCourt) వాయిదా వేసింది. ఈ కేసు విచారణను సీబీఐకు అప్పగించాలని ఉండవల్లి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఉండవల్లి పిటిషన్‌పై ఈరోజు (శుక్రవారం) హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌పై విచారణను ధర్మాసనం ఈనెల 29కి వాయిదా వేసింది. ఈ కేసులో ప్రతివాదులకు  నోటీసులు జారీ చేయాలని గతంలోనే హైకోర్టు  ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశాన్ని  జడ్జి ఎదుట ప్రస్తావించిన లాయర్లు ... ఇంకా  ఈ నోటీసులు అందరికీ అందలేదని పేర్కొన్నారు. నోటీసులను అందరికీ అందకపోవడంతో కేసు విచారణను హైకోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది. ఆలస్యంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీకి న్యాయమూర్తి సూచించారు.

కొందరికి నోటీసులు జారీ చేయడంలో ఆలస్యం జరిగిందని ఉండవల్లి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.కేసు విచారణను సీబీఐకి అప్పగించడంలో తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వం తరపున  ఏజీ కోర్టుకు తెలిపారు. అదే విషయాన్ని అఫిడవిట్‌ రూపంలో దాఖలు చేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.