క్రాష్ సేఫ్టీ టెస్ట్​లో స్కోడా స్లావియాకు 5 స్టార్​ రేటింగ్​

క్రాష్ సేఫ్టీ టెస్ట్​లో స్కోడా స్లావియాకు 5 స్టార్​ రేటింగ్​

క్రాష్ సేఫ్టీ టెస్ట్​లో స్కోడా స్లావియాకు 5 స్టార్​ రేటింగ్​

హైదరాబాద్​, వెలుగు : గ్లోబల్ న్యూ కార్ అసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రోగ్రామ్ (ఎన్​సీఏపీ) ఇటీవల యూరప్​లో నిర్వహించిన క్రాష్ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో తమ సెడాన్​ కారు స్లావియాకు 5 స్టార్​ రేటింగ్​ వచ్చిందని స్కోడా ప్రకటించింది. ఇప్పటి వరకు ఇదే అత్యంత సురక్షితమైన కారుగా రికార్డులకు ఎక్కిందని తెలిపింది.  పెద్దలతోపాటు  పిల్లలకూ ఈ కారు పూర్తి సురక్షితమని  స్కోడా ఆటో ఇండియా  బ్రాండ్ డైరెక్టర్ పెట్ర్ సోల్క్ అన్నారు. క్వాలిటీ, మన్నిక,  భద్రతకు తాము చాలా ఇంపార్టెన్స్​ ఇస్తామని వివరించారు.

స్లావియాలో ఆరు ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, మల్టీ-కొలిజన్ బ్రేకింగ్, ట్రాక్షన్ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, చైల్డ్ సీట్ల కోసం ఐఎస్​ఓఫిక్స్​ మౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, టాప్ టెథర్ యాంకర్ పాయింట్లు, రెయిన్-సెన్సింగ్ వైపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఆటోమేటిక్ హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైట్లు,  టైర్-రెజర్ మానిటరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు అడల్ట్​ సేఫ్టీ విషయంలో గరిష్టంగా 34 పాయింట్లలో 29.71 స్కోర్ వచ్చింది. ఇది 5-స్టార్ రేటింగ్​కు సమానం.