Asia Cup 2023 Final:50 పరుగులకే లంక చిత్తు.. 8వ టైటిల్ దిశగా భారత్  

Asia Cup 2023 Final:50 పరుగులకే లంక చిత్తు.. 8వ టైటిల్ దిశగా భారత్  

ఆసియా కప్ లో భారత్ మరో టైటిల్ దిశగా దూసుకెళ్తుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. మ్యాచ్ ప్రారంభమైన తొలి గంటలోనే ఆలౌటై సొంత గడ్డపై పరువు పోగొట్టుకున్నారు. తొలి ఓవర్లో బుమ్రా.. కుశాల్ పెరీరా వికెట్ తీసి శుభారంభం ఇవ్వగా.. ఆ తరవాత సిరాజ్ అదే పనిగా చెలరేగిపోయాడు. నాలుగో ఓవర్లో నాలుగు వికెట్లు తీసి లంక జట్టును కోలుకోనీకుండా చేసాడు. 12 పరుగులకే సగం జట్టుని కోల్పోయిన లంక చివరికి 15.2 ఓవర్లలో కేవలం 50 పరుగులకే ఆలౌటైంది. 

లంక జట్టులో 17 పరుగులు చేసిన కుశాల్ మెండిస్ టాప్ స్కోరర్. హేమంత్ 13 పరుగులు చేసాడు. వీరిద్దరూ  మినహా మిగిలిన వారందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో సిరాజ్ కి 6,హార్దిక్ కి 3 వికెట్లు దక్కగా.. బూమ్రాకి ఒక వికెట్ లభించింది. 
       
8 వ టైటిల్ దిశగా అడుగులు

ఇప్పటివరకు 7 సార్లు ఆసియా కప్ టైటిళ్లు గెలిచిన భారత్.. 8 వ టైటిల్ తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధంగా ఉంది. కేవలం 51 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగబోతుంది.