బిగ్గెస్ట్ క్రికెట్ ఫ్యాన్ కి భారీ నజరానా.. శ్రీలంక క్రికెట్ బోర్డు గొప్ప మనసు

బిగ్గెస్ట్ క్రికెట్ ఫ్యాన్ కి భారీ నజరానా.. శ్రీలంక క్రికెట్ బోర్డు గొప్ప మనసు

క్రికెట్ నాలెడ్జ్ ఉంటే చాలు మనమే క్రికెట్ లో అతి పెద్ద ఫ్యాన్ గా ఫీల్ అయిపోతాం. టీవీలో గ్రౌండ్ లో ఆటగాళ్లను సపోర్ట్ చేస్తూ మనకు మించిన అభిమాని లేరనుకుంటాం.అయితే ఒక వ్యక్తి గురించి వింటే మన అభిప్రాయమంతా మారిపోతుంది. అతడెవరో కాదు శ్రీలంక  "లెజెండరీ చీర్‌లీడర్" పెర్సీ అబేశేఖర్. శ్రీలంక క్రికెట్ జట్టు గెలవాలని ఎప్పుడూ పరితపించే అతనికి తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు భారీ నజరానా ప్రకటించింది. 

13 లక్షల చెక్కు

శ్రీలంక క్రికెట్ బోర్డు గొప్ప నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా  శ్రీలంక క్రికెట్ (SLC) సోమవారం "లెజెండరీ చీర్‌లీడర్" పెర్సీ అబేశేఖరకు అతని శ్రేయస్సు మరియు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ₹13 లక్షల చెక్కును అందించింది. "శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడు శ్రీ షమ్మీ సిల్వా నేతృత్వంలోని శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. చెక్కును ఎస్‌ఎల్‌సి కార్యదర్శి మోహన్ డిసిల్వా 'అంకుల్' పెర్సీకి అందజేశారు. డిసిల్వా లంక క్రికెట్ బోర్డు తరపున పెర్సీని కలిసి అతని ఆరోగ్యం  గురించి విచారించారు.

ఈ సందర్భంగా డిసిల్వా మాట్లాడుతూ "శ్రీలంకలో క్రికెట్ ఆటకు చీర్‌లీడర్‌గా పెర్సీ అందించిన సహకారం ఎనలేనిది.అతడు శ్రీలంక జట్టుని సపోర్ట్ చేసిన విధానం అద్భుతం". ఇక ఈ నెల ప్రారంభంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఆసియా కప్ కోసం శ్రీలంకలో ఉన్నప్పుడు పెర్సీ నివాసాన్ని సందర్శించాడు. సెప్టెంబర్ 8న పాకిస్థాన్‌తో భారత్ సూపర్ 4 పోరుకు ముందు రోహిత్ పెర్సీని కలిశాడు.