ఆస్తమాకు అడ్డా ఇరుకు ఇండ్లు, ఏసీ ఆఫీసులు

ఆస్తమాకు అడ్డా ఇరుకు ఇండ్లు, ఏసీ ఆఫీసులు

పెరిగిపోతున్న ఇంటర్నల్​ పొల్యూషన్​
శ్వాస సంబంధిత రోగాల బారిన జనం
వెంటిలేషన్​ సరిగా లేకపోవడమే కారణం
ఓ స్టడీలో వెల్లడి

హైదరాబాద్, వెలుగుఎక్కువ సేపు ఇరుకు ఇండ్లల్లో, ఏసీ ఆఫీసుల్లో ఉండే వాళ్లు ఆస్తమా వంటి శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు తేలింది. లోపలి గాలి బయటికి వెళ్లక.. బయటి గాలి లోపలికి రాక.. ఆ ఇండ్లు, ఆఫీసులు కాలుష్య కేంద్రాలుగా మారిపోతున్నాయి. ఇటీవల హైదరాబాద్​లో ప్రైవేటు డాక్టర్స్​ అసోసియేషన్​ నిర్వహించిన ఓ స్టడీలో చేదు వాస్తవాలు వెలుగుచూశాయి. వీరు పలు ఐటీ కంపెనీల్లోని 2 వేల మంది ఉద్యోగులపై స్టడీ చేశారు.  ఇందులో 1,872 మంది ఆస్తమాతో బాధపడుతున్నట్లు తేలింది. వారు పనిచేసే ఆఫీసులు ఇరుకు గదుల్లో ఉండటం, గాలి కోసం ఏసీలనే ఆశ్రయించడంతో ఈ సమస్య తలెత్తుతోందని వెల్లడైంది. ఇరుకు ఇండ్లలో నివసించే వారిలోనూ ఇదే పరిస్థితి ఉందని ఆ డాక్టర్లు పేర్కొన్నారు.

దడపుట్టిస్తున్న ఇంటర్నల్​ పొల్యూషన్​

హైదరాబాద్​ వంటి నగరాల్లో బయటి గాలే కాదు.. ఇండ్లు, ఆఫీసుల్లోని గాలి కూడా కలుషిమతవుతోంది. బయటి కాలుష్యం కన్నా.. ఇండ్లు, ఆఫీసుల్లోని గాలి కాలుష్యం  (ఇంటర్నల్​ పొల్యూషన్​) జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వాస్తవంగా ఇంటర్నల్​ పొల్యూషన్​లో ఎయిర్​ క్వాలిటీ ఇండెక్స్​ 15  ఉండాలి. కానీ హైదరాబాద్​లోని కొన్ని ఆఫీసుల్లో అది 20 నుంచి 25 దాటిపోయి ఉంటుందని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ఈ పొల్యూషన్​ను ఖచ్చితంగా  లెక్కించడానికి రాష్ట్ర పీసీబీ వద్ద సరైన పరికరాలు లేవు. ఇంటర్నల్​ పొల్యూషన్​ వల్లే ఐటీ ఆఫీసుల్లోని సుమారు 85 శాతం మంది ఉద్యోగులు ఆస్తమా వంటి వ్యాధుల బారిన పడుతున్నట్లు డాక్టర్ల  స్టడీలో బయటపడింది. పదేండ్ల కిందటి వరకు.. రోజూ ఏసీ రూముల్లో ఉండే వ్యక్తుల్లో వంద మందిలో ఒకరిద్దరికి మాత్రమే ఆస్తమా ఉండేది. కానీ.. ఇప్పుడు ఆ సంఖ్య 10కి చేరింది. గదుల్లో వెంటిలేషన్​ సరిగా లేక ఏసీల నుంచి నేరుగా వచ్చే గాలితోనే ఆస్తమా వంటి సమస్యలు ఎదురవుతున్నాయని డాక్టర్లు అంటున్నారు. పైగా నగరాల్లో చాలా మందికి సూర్యరశ్మి తగలక విటమిన్​ డీ లోపిస్తోందని, ఫలితంగా వారిలో రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతోందని చెబుతున్నారు.

లోపలి గాలి లోపలే..

హైదరాబాద్​లోనే కాదు రాష్ట్రంలోని ఇతర నగరాల్లోనూ ఇండ్లు, ఆఫీసుల్లో వెంటిలేషన్​ సరిగ్గా ఉండటం లేదు. ఇరుకు గదులు.. పైగా ఏసీలు. ఈ మధ్య ప్రత్యేకంగా ఇంటీరియర్​ డిజైన్లతో నిర్మాణాలు. అలాంటి గదుల్లో ఎక్కువసేపు ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి దుమ్ము, ధూళితో కలిసి గాలి ఆ గదుల్లోకి వెళ్తే మళ్లీ బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. దీంతో గదుల్లోని ఏసీ చల్లదనానికి గాలిలో బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. అలాంటి గాలిని పీలిస్తే శ్వాస సంబంధ రోగాలు వస్తాయని డాక్టర్లు అంటున్నారు. ఇక.. ఇండ్లల్లో బెడ్స్​, దిండ్లు, సోఫాలు ఎక్కువ రోజులపాటు అలానే ఉంచడంతో బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుందని, దాని వల్ల కూడా జనం రోగాల బారినపడుతున్నారని చెబుతున్నారు. ఇరుకు ఇండ్లలో నివసించే వారిలోనూ ఇదే పరిస్థితి ఉందని ఆ డాక్టర్లు పేర్కొన్నారు.

లోపలి గాలి లోపలే..

హైదరాబాద్​లోనే కాదు రాష్ట్రంలోని ఇతర నగరాల్లోనూ ఇండ్లు, ఆఫీసుల్లో వెంటిలేషన్​ సరిగ్గా ఉండటం లేదు. ఇరుకు గదులు.. పైగా ఏసీలు. ఈ మధ్య ప్రత్యేకంగా ఇంటీరియర్​ డిజైన్లతో నిర్మాణాలు. అలాంటి గదుల్లో ఎక్కువసేపు ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి దుమ్ము, ధూళితో కలిసి గాలి ఆ గదుల్లోకి వెళ్తే మళ్లీ బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. దీంతో గదుల్లోని ఏసీ చల్లదనానికి గాలిలో బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. అలాంటి గాలిని పీలిస్తే శ్వాస సంబంధ రోగాలు వస్తాయని డాక్టర్లు అంటున్నారు. ఇక.. ఇండ్లల్లో బెడ్స్​, దిండ్లు, సోఫాలు ఎక్కువ రోజుల పాటు అలానే ఉంచడంతో బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుందని, దాని వల్ల కూడా జనం రోగాల బారినపడుతున్నారని చెబుతున్నారు.

దడపుట్టిస్తున్న ఇంటర్నల్​ పొల్యూషన్​

హైదరాబాద్​ వంటి నగరాల్లో బయటి గాలే కాదు.. ఇండ్లు, ఆఫీసుల్లోని గాలి కూడా కలుషిమతవుతోంది. బయటి కాలుష్యం కన్నా.. ఇండ్లు, ఆఫీసుల్లోని గాలి కాలుష్యం  (ఇంటర్నల్​ పొల్యూషన్​) జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వాస్తవంగా ఇంటర్నల్​ పొల్యూషన్​లో ఎయిర్​ క్వాలిటీ ఇండెక్స్​ 15  ఉండాలి. కానీ హైదరాబాద్​లోని కొన్ని ఆఫీసుల్లో అది 20 నుంచి 25 దాటిపోయి ఉంటుందని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ఈ పొల్యూషన్​ను ఖచ్చితంగా  లెక్కించడానికి రాష్ట్ర పీసీబీ వద్ద సరైన పరికరాలు లేవు. ఇంటర్నల్​ పొల్యూషన్​ వల్లే ఐటీ ఆఫీసుల్లోని సుమారు 85 శాతం మంది ఉద్యోగులు ఆస్తమా వంటి వ్యాధుల బారిన పడుతున్నట్లు డాక్టర్ల  స్టడీలో బయటపడింది. పదేండ్ల కిందటి వరకు.. రోజూ ఏసీ రూముల్లో ఉండే వ్యక్తుల్లో వంద మందిలో ఒకరిద్దరికి మాత్రమే ఆస్తమా ఉండేది. కానీ.. ఇప్పుడు ఆ సంఖ్య 10కి చేరింది. గదుల్లో వెంటిలేషన్​ సరిగా లేక ఏసీల నుంచి నేరుగా వచ్చే గాలితోనే ఆస్తమా వంటి సమస్యలు ఎదురవుతున్నాయని డాక్టర్లు అంటున్నారు. పైగా నగరాల్లో చాలా మందికి సూర్యరశ్మి తగలక విటమిన్​ డీ లోపిస్తోందని, ఫలితంగా వారిలో రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతోందని చెబుతున్నారు.

ఐదేండ్ల నుంచి ఆస్తమాతో బాధపడుతున్న

ఐటీ రంగంలోకి వచ్చి ఐదేండ్లు దాటిపోయింది. రోజు ఇంట్లో, ఆఫీసులు సుమారు 10 నుంచి 15 గంటలు ఏసీ గదుల్లో ఉండటం వల్ల ఆస్తమా  వచ్చింది. అంతేగాక రోజూ ఏదో దగ్గు, జలుబు వంటి సమస్యలు వచ్చి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతోంది. ఎన్ని రకాల మందులు వాడుతున్నా పూర్తిగా రిలీఫ్​  లభించడం లేదు. – సుశాంత్, ఐటీ నిపుణుడు, గచ్చిబౌలి

ఎక్కువ టైం ఏసీ గదుల్లో ఉండొద్దు

నిత్యం నాలుగు గోడల మధ్య ఏసీ గదులలో ఉండటం వల్ల ఆస్తమా రోగులకు ఇబ్బందులు ఉంటాయి. అదే విధంగా ఏసీ గదుల్లో గాలి రిఫ్రెష్​ కాకపోతే బ్యాక్టీరియా వ్యాప్తి చెంది ఊపిరితిత్తుల సమస్యలు అధికంగా వస్తాయి. ఎక్కువ సమయం ఏసీ గదుల్లో  ఉండకపోవడం మేలు. – డాక్టర్​ నరేశ్, పల్మనాలజిస్ట్​

ఇంటర్నల్​ పొల్యూషన్​ను లెక్కించే పరికరాల్లేవ్​

రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వద్ద బయటి వాతావరణ కాలుష్యాన్ని  లెక్కించే పరికరాలు ఉన్నప్పటికీ.. ఇంటర్నల్​ పొల్యూషన్​ను  లెక్కించే పరికరాలు లేవు. వాటి కోసం ప్రతిపాదనలు పెట్టాం. ఓ అధ్యయనం ప్రకారం ఇప్పటికే ఇంటర్నల్​ పొల్యూషన్​  పరిమితులు దాటిపోయింది.  రాబోయే రోజుల్లో ఆ కాలుష్యాన్ని లెక్కించి,  దానిపై  ప్రజలకు అవగాహన కల్పిస్తం.  – మురళీ మోహన్, పీసీబీ ఆఫీసర్​

మరిన్ని వార్తల కోసం