చిన్న ఆలోచనలతోనే పెద్ద ఆవిష్కరణలు : డీఈవో శ్రీరాం మొండయ్య

చిన్న ఆలోచనలతోనే పెద్ద ఆవిష్కరణలు : డీఈవో శ్రీరాం మొండయ్య

కొత్తపల్లి, వెలుగు: చిన్న ఆలోచనలే పెద్ద ఆవిష్కరణలకు దారితీస్తాయని డీఈవో శ్రీరాం మొండయ్య అన్నారు. కొత్తపల్లి పట్టణంలోని అల్ఫోర్స్​ఈ–టెక్నో స్కూల్​లో జరుగుతున్న సైన్స్​ఫేర్​ను ఆదివారం ఆయన సందర్శించారు. విద్యార్థులు చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలిస్తూ కొత్తగా ఆలోచించి నూతన ఆవిష్కరణలు చేయాలని సూచించారు. 

జిల్లా సైన్స్ అధికారి జైపాల్​రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 2,652 మంది విద్యార్థులు సైన్స్​ఫేర్​కు వచ్చారన్నారు. చివరి రోజు సోమవారం మిగతా పాఠశాలల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు వచ్చి, ప్రదర్శనలను చూడాలని చెప్పారు. డీసీఈబీ సెక్రటరీ భగవంతయ్య, సెక్టోరియల్ ఆఫీసర్స్​అశోక్​రెడ్డి, ఆంజనేయులు, శ్రీనివాస్, కృపారాణి, కొత్తపల్లి, గంగాధర, సైదాపూర్, గన్నేరువరం ఎంఈవోలు ఆనందం, ప్రభాకర్​రావు, రవీంద్రాచారి, రామయ్య తదితరులు పాల్గొన్నారు.