గద్వాల జిల్లా మనిషి ఆకారంలో పురుగు ప్రత్యక్షం

గద్వాల జిల్లా మనిషి ఆకారంలో పురుగు  ప్రత్యక్షం
  • గద్వాల జిల్లా చెనుగోనిపల్లిలో ప్రత్యక్షం
  • అరుదుగా కనిపించే స్టిక్​ బగ్ ​అంటున్న శాస్త్రవేత్తలు

గద్వాల,వెలుగు : గద్వాల జిల్లాలో మనిషి ఆకారంలో ఉన్న ఓ చిన్న పురుగు కనిపించింది. గద్వాల మండల పరిధిలోని చెనుగోనిపల్లిలో హలీం పాషా ఇంటి ఆవరణలో ఉన్న చెట్టుపై కనిపించిన ఈ పురుగుకు కళ్లు, ముక్కు, నోరు, తల అన్నీ మనిషిని పోలినట్టు ఉండడంతో చూసినవారంతా ఆశ్చర్యపోయారు. అయితే,  పురుగు పేరు స్టిక్ బగ్ (కాండం తొలుచు పురుగు) అని జీవ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి పురుగులు మన దేశంలో అరుదుగా కనిపిస్తాయని,  థాయిలాండ్, శ్రీలంక, ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా ఉంటాయన్నారు.