చిన్న చిత్రాలు పెద్ద విజయాలు

చిన్న చిత్రాలు పెద్ద విజయాలు

ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పలు చిన్న చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాయి. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సిన చిత్రం ‘బలగం’. కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందించిన ఈ సినిమాకి  ప్రశంసలతో పాటు కాసుల వర్షం కురిపించాయి.  హ్యూమన్ ఎమోషన్స్  బ్యాక్‌‌డ్రాప్‌‌తో ఈ సినిమా తెరకెక్కించారు. 

కేవలం రూ.3 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా.. రూ.25 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి  చిన్న చిత్రాల్లో పెద్ద విజయాన్ని అందుకుంది. పలు అవార్డులను సైతం అందుకుంది. తర్వాత ఈ లిస్టులో ‘బేబీ’ చిత్రం చేరింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి  చైతన్య జంటగా సాయి రాజేష్​ రూపొందించిన ఈ చిత్రం కూడా ఊహించని విజయం సాధించింది. అలాగే శ్రీవిష్ణు నటించిన ‘సామజవరగమన’  కేవలం రూ.7కోట్ల బడ్జెట్‌‌తో తెరకెక్కి  సుమారు రూ.50 కోట్లకు పైగానే రాబట్టింది. 2023లో ఇదో సర్‌‌‌‌ప్రైజింగ్ హిట్ మూవీ. అలాగే ఈ ఏడాది చిన్న చిత్రంగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన చిత్రాల్లో ‘మ్యాడ్’ ఒకటి.