కాలిఫోర్నియాలో  ఇండ్లపై కూలిన విమానం

కాలిఫోర్నియాలో  ఇండ్లపై కూలిన విమానం

కాలిఫోర్నియా: అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఓ ఎయిర్​క్రాఫ్ట్ ఇండ్లపై కూలింది. ఈ ప్రమాదంలో మన దేశ మూలాలున్న ఓ కార్డియాలజిస్ట్, మరో కార్మికుడు చనిపోయారు. ఇంకో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో విమానంతోపాటు రెండు ఇండ్లు, పార్క్​చేసిన పలు వెహికల్స్​కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో చనిపోయిన డాక్టర్​సుగత దాస్​ఇండియాలో బెంగాలీ కుటుంబంలో జన్మించారు. పుణెలో పెరిగారు. అమెరికాలోని శాన్​డియాగోలో స్థిరపడిన ఆయన ప్రస్తుతం అరిజోనాలోని యుమా రీజినల్ మెడికల్ సెంటర్(వైఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ)లో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నారు. ఎయిడ్స్ బాధితులను ఆదుకునే ‘పవర్ ఆఫ్​లవ్​ఫౌండేషన్’ స్వచ్ఛంద సంస్థకు  డైరెక్టర్​గా ఉన్నారు.​ కాగా సుగత దాస్​కు ట్విన్​ఇంజిన్​సెస్నా 340 ఎయిర్​క్రాఫ్ట్​ఉంది. ఇందులో ఆయన యుమా మెడికల్​సెంటర్​కు వెళ్తుంటారు. సోమవారం మధ్యాహ్నం12.15 గంటల ప్రాంతంలో కాలిఫోర్నియాలోని గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాజిల్ స్ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పరిసరాల్లో ట్విన్- ఇంజిన్ సెస్నా సి340 కూలిపోయిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. ప్రమాదం జరిగిన పక్కనే ఓ స్కూల్​ఉంది. పెద్ద ఎత్తున మంటలు, పొగ వ్యాపించడంతో అందరూ ఆందోళన చెందారు. అయితే, స్టూడెంట్స్​అంతా సేఫ్​గా ఉన్నారని, పేరెంట్స్​భయపడొద్దని స్కూల్​యాజమాన్యం ట్వీట్ చేసింది.