చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ మోటార్లు ఎక్కడ తయారు చేశారో తెలుసా...

చంద్రయాన్  3 విక్రమ్ ల్యాండర్ మోటార్లు ఎక్కడ తయారు చేశారో తెలుసా...

చంద్రునిపై ల్యాండ్ అయిన  చంద్రయాన్-3  అంతరిక్ష యాత్రలో  కొత్త చరిత్ర సృష్టించబోతోంది. ల్యాండింగ్ అప్‌డేట్ కోసం కోట్లాది మంది భారతీయులు మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం చూస్తున్నారు. చంద్రయాన్ 3 ను  విజయవంతం చేయడంలో ఇస్రో ఈ మిషన్‌కు  ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు  సహకరించడంలో పాలుపంచుకున్నాయి . కొన్ని కంపెనీలు బ్యాటరీలపై పని చేస్తే, మరికొన్ని కంపెనీలు రాకెట్లను తయారు చేశారు.  

తమిళనాడులోని సేలం జిల్లాలోని ఒక ఇంజనీరింగ్ కళాశాల మూన్ మిషన్ కోసం మోటార్‌లను రూపొందించింది.  సోనా కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ  విద్యార్థులు, ప్రొఫెసర్లు  LVM-3 రాకెట్‌లోఉపయోగించేందుకు  ఒక స్టెప్పర్ మోటారును తయారు చేశారు. ఇది  చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ ను  పైకి తీసుకెళ్తూ  భూమి యొక్క కక్ష్యలో ఉంచేందుకు ఉపయోగించారు.   శ్రీహరికోటలోని  సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో చేపట్టిన   చంద్రయాన్ 3  విజయవంతం కావడంలో తమిళనాడులోని అతిచిన్న గ్రామం సేలంలోని సోనా టెక్నాలజీ బృందం కీలక పాత్ర పోషించింది.  వారు తయారు చేసి ఇచ్చిన స్టెప్పప్ మోటార్లు రాకెట్ ఇంజిన్ ఇంధనం,ఆక్సిడైజర్ మిశ్రమం నిష్పత్తిని నియంత్రిస్తుంది. దీనిని  చంద్రయాన్ 3 లాంచ్ వెహికల్ మార్క్ III (LVM3) లో ఉపయోగించారు. 

సోనా కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లోని  R&D యూనిట్ అయిన సోనా స్పీడ్ (సోనా స్పెషల్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రిక్ డ్రైవ్స్)చే రూపొందించబడిన కీలకమైన భాగాన్ని  తయారు చేశారు.  SONA 25kW క్వాడ్రప్లెక్స్ BLDC మోటారును హెలికాప్టర్ హాయిస్ట్‌లో RLVని 4.5 కి.మీ  ఎత్తులో ల్యాండింగ్ కోసం విడుదల చేయడానికి ఉపయోగించారు.2017లో, సోనా కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు, మరో ఐదు కళాశాలల విద్యార్థులతో కలిసి ISRO ... PICO ఉపగ్రహాన్ని ప్రయోగించారు.