Smart Health : గాయాలను తగ్గించే స్మార్ట్ బ్యాండేజీ

Smart Health : గాయాలను తగ్గించే స్మార్ట్ బ్యాండేజీ

గాయాలను గుర్తించి, వాటిని నయం చేయించుకోవడానికి డాక్టర్ కావాలి. అయితే టెక్నాలజీ పుణ్యమా అని కొన్ని పనులు డాక్టర్ అవసరం లేకుండానే తీరిపోతున్నాయి. అలాంటి వాటిలోనే ఈ స్మార్ట్ బ్యాండేజీ ఒకటి. పెద్ద పెద్ద గాయాలు పూర్తిగా తగ్గాయా? లేదా? అని గుర్తించి, వాటిని కంప్లీట్ గా హీల్ చేయడానికి వీలైన బ్యాండేజీని ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్ బోలోగ్నా సైంటిస్టులు తయారు చేశారు. 

ఇది దగ్గర ఉంటే చాలు, శరీరంపైన ఉన్న గాయాలను ఫోన్ సాయంతో తగ్గించుకోవచ్చు. ఈ బ్యాండేజీలో ప్రత్యేకంగా ఓ సెన్సర్ ఉంటుంది.

గాయం తీవ్రతను రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అనే చిప్ ద్వారా స్మార్ట్ఫోన్ కు మెసేజ్ పంపిస్తుంది. తేమ శాతం జీరోగా ఉంటే గాయం మానినట్టు క్లారిటీ ఇస్తుంది. రోడ్ యాక్సిడెంట్ దెబ్బలు, కాలిన గాయాలు, బొబ్బలు వంటి గాయాలు తగ్గాయా? లేదా? గుర్తించి, వాటికి తగ్గహెల్త్ టిప్స్ అందిస్తుంది ఈ స్మార్ట్ బ్యాండేజీ.