ఎయిర్‌‌‌‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కొత్త ఫీచర్

ఎయిర్‌‌‌‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కొత్త ఫీచర్
  • స్మార్ట్ ‌‌ఫోన్ తోనే  పీఓఎస్
  • మర్చెంట్ బేస్ పెంచుకునే ప్లాన్స్

న్యూఢిల్లీ: ఎయిర్‌‌‌‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తన మర్చెంట్ బేస్‌‌ను వచ్చే కొన్ని నెలల్లో 25 లక్షలకు చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఎయిర్‌‌‌‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ మర్చెంట్ బేస్ 15 లక్షలుగా ఉంది.  మర్చెంట్లు  చేతిలోని స్మార్ట్‌‌ఫోన్స్‌‌నే పాయింట్ ఆఫ్ సేల్స్(పీఓఎస్) మిషన్స్‌‌గా మార్చేలా యాప్‌‌ను  కంపెనీ లాంఛ్ చేసింది. యాప్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకుని, మనీ డైరెక్ట్‌‌గా వారి బ్యాంక్ అకౌంట్‌‌లో పడేలా ఈ యాప్‌‌ను రూపొందించినట్టు చెప్పింది. ‘ఎయిర్‌‌‌‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌‌కి 15 లక్షల మర్చెంట్లు ఉన్నారు. మర్చెంట్ బేస్‌‌ను మరింత విస్తరించాలని బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే కొన్ని నెలల్లో మరో పది లక్షల మంది కొత్త మర్చెంట్లను చేర్చుకోవాలని ప్లాన్స్ చేస్తున్నాం’ అని ఎయిర్‌‌‌‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తెలిపింది.