
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ మేకర్ నథింగ్ ఇండియా మార్కెట్లోకి 2ఏ ఫోన్ను లాంచ్ చేసింది. ఇందులో 6.7 ఇంచుల స్క్రీన్, వెనుక రెండు కెమెరాలు, 32 ఎంపీ సెల్ఫీకెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి.
దీని ధర రూ.23,999 (8జీబీ ర్యామ్+ 128 జీబీ) కాగా, 8జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.25,999 ఉంటాయి. 12జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ కలిగిన టాప్ వేరియంట్ ధర రూ.27,999.