చిన్నశంకరంపేట, వెలుగు: చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన స్థానిక ఎన్నికల నామినేషన్ సెంటర్లను ఎన్నికల పరిశీలకురాలు భారతి లక్పతి నాయక్ మంగళవారం పరిశీలించారు. ప్రతి కౌంటర్ వద్దకు వెళ్లి ఎన్నికల నామినేషన్ ప్రక్రియను గమనించారు.
ఆమె మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ సమయంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు. నామినేషన్ల స్వీకరణ సమయంలో ఎన్నికల సంఘం నియమ నిబంధనలు పాటించాలని సిబ్బందికి సూచించారు. ఆమె వెంట ఎంపీడీవో దామోదర్, డీఎస్పీ నరేందర్ గౌడ్ ఉన్నారు.
