ముంబై: భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధనా, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ వివాహం చివరి నిమిషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. 2025, నవంబర్ 23న వీరి వివాహం జరగాల్సి ఉండగా.. పెళ్లికి కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి అనారోగ్యానికి గురి కావడంతో పెళ్లి ఆగిపోయింది. అయితే, పలాష్, స్మృతి పెళ్లి పోస్ట్‌పోన్ వెనక మరో కారణం ఉందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది.
పలాష్ ముచ్చల్ ఓ లేడీ కొరియోగ్రాఫర్‌తో చేసిన చాట్ లీక్ కావడం వల్లే పెళ్లి క్యాన్సిల్ అయిందని ఊహాగానాలు వినిపించాయి. ఈ వార్తలపై స్మృతి మంధనా, పలాష్ ముచ్చల్ ఎవరూ స్పందించలేదు. ఇంతలోనే స్మృతి మంధనా తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి పెళ్లికి సంబంధించిన అన్ని ఫొటోలను డిలీట్ చేసింది. దీంతో స్మృతి, పలాష్ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందన్న ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.
►ALSO READ | Vaibhav Suryavanshi: 14 ఏళ్ళ కుర్రాడి ధాటికి కోహ్లీ, రోహిత్, గిల్ వెనక్కి.. గూగుల్ సెర్చ్‌లో సూర్యవంశీ టాప్
ఇదిలా ఉండగా.. పెళ్లి ఆగిపోయినప్పటి నుంచి స్మృతి మందనా సోషల్ మీడియాకు దూరంగా ఉంది. బయట కూడా ఎక్కడ కనిపించలేదు. వరల్డ్ కప్ విజేత టీమిండియా వెళ్లిన అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్ పతి షోకు కూడా స్మృతి హాజరుకాలేదు. ఈ క్రమంలో పెళ్లి ఆగిపోయిన తర్వాత ఫస్ట్ టైమ్ శుక్రవారం (డిసెంబర్ 5) స్మృతి తన ఇన్స్‌స్టా గ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టింది.
ప్రముఖ టూత్‌పేస్ట్ బ్రాండ్ కోసం ప్రమోషనల్ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో స్మృతి చేతికి పలాష్ తొడిగినా ఎంగేజ్మెంట్ రింగ్ లేదు. దీంతో స్మృతి, పలాష్ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందన్న ప్రచారం మళ్లీ ఊపందుకుంది. అయితే.. కొందరు మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. ఈ యాడ్ వీడియో నిశ్చితార్థానికి ముందే తీసిందంటూ కామెంట్ చేస్తున్నారు. దీంతో స్మృతి, పలాష్ పెళ్లిపై సందిగ్ధం అలాగే కొనసాగుతోంది.
ఇక, క్రికెట్ విషయానికి వస్తే.. 2025, డిసెంబర్ 21 నుంచి 30 వరకు స్వదేశంలో శ్రీలంకతో జరిగే ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో స్మృతి బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లు విశాఖపట్నం, తిరువనంతపురం వేదికగా జరగనున్నాయి. ఆ తర్వాత 2026, జనవరి 9న నవీ ముంబైలో ప్రారంభమయ్యే మహిళల ప్రీమియర్ లీగ్‌లో స్మృతి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు నాయకత్వం వహిస్తుంది.
