
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పాము హల్చల్ చేసింది. ఆదివారం ( జులై 27 ) ఉదయం ఆలయంలోని రూ. 750 రాహు కేతు పూజ మండపం మెట్ల దగ్గర పాము ప్రత్యక్షమైంది. దీంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు ఆలయ సిబ్బంది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారి దాము ఘటనాస్థలానికి చేరుకొని పామును చాకచక్యంగా పట్టుకున్నారు.
అనంతరం పామును రామాపురం అడవుల్లో సురక్షితంగా వదిలేశారు అధికారులు. దీంతో భక్తులు, ఆలయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే రాహు కేతు పూజ మండపం దగ్గర పాము ప్రత్యక్షమవడంతో భయబ్రాంతులకు గురయ్యారు భక్తులు. ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులు పామును పట్టుకొని అడవిలో వదిలేయడంతో ఘటనాస్థలి దగ్గర ప్రశాంత వాతావరణం నెలకొంది.